నటుడు జయం రవి హీరోగా 2004లో తెరకెక్కిన చిత్రం ఎం కుమారన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆసిన్ హీరోయిన్ గా నటించారు. జయం రవికి తల్లిగా నదియా కనిపించారు. అయితే ఎడిటర్ మోహన్ నిర్మించిన ఈ చిత్రం 2004లో రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులో మాస్ మహారాజా రవితేజ నటించిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రానికి రీమేక్ గా దీన్ని అక్కడ రూపొందించారు.
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రం 2003 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. రవితేజ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది ఈ చిత్రం.

తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించడానికి దర్శకుడు మోహన్ రాజా సనాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ లో సమాచారం.దీనికి సంబంధించి కథ కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. కాగా ఇందులో నటి నదియా పాత్ర కూడా ఉంటుందని సమాచారం.అయితే ఆమెనే ఎంపిక చేస్తారా? అదే విధంగా హీరోయిన్ గా ఎవరు నటిస్తారు? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే అప్పుడు హీరోయిన్ గా నటించిన ఆసిన్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంది.మోహన్ రాజా ప్రస్తుతం జయం రవి హీరోగా తనీ ఒరువన్ చిత్రానికి సిక్వల్ గా తనీ ఒరువన్ -2 తర్కెక్కించే ప్రయత్నంలో ఉన్నారు.

ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఎం.కుమారన్ చిత్రాన్ని ప్రారంభించినట్లుగా సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే. ఎం.కుమారన్ సన్నాఫ్ మహాలక్ష్మి తెలుగు సినిమా అమ్మ నాన్న ఓ తమిళమ్మాయికి రీమేక్ అయినప్పటికీ తమిళ్ అభిమానులను ఆకట్టుకునేలా మోహన్ రాజా అనేక మార్పులు చేశారు. ఈ చిత్రం తమిళనాడులో పెద్ద హిట్ గా నిలిచింది.ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ,ఐశ్వర్య, వివేక్, జనకరాజ్, వెన్నిరా ఆడే మూర్తి ముఖ్యపాత్రలు పోషించారు.

అయితే తెలుగులో మాత్రం అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రానికి సీక్వెల్ వస్తుందా అనే విషయం పైన ఎటువంటి సమాచారం లేదు. హీరో రవితేజ కి పూరి జగన్నాథ్ కి డేట్ లు కుదరాలి.ఇద్దరు కలిసి కథ విషయం పైన ఒక అంగీకారానికి వస్తే గాని ఈ విషయం పైన స్పష్టత రాదు.
Also Read:యానిమల్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు ..ఎక్కడో తెలుసా?


ఓవరాల్ గా టీజర్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా పెంచేసింది. సంక్రాంతికి భారీ పోటీ నడుమ రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉండగా ఆ టైంలో ఈ కాన్సెప్ట్ మూవీని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి. ఒకవేళ బాగా రిసీవ్ చేసుకుంటే మాత్రం బాక్సాఫీస్ దగ్గర రవితేజ స్టామినా ఏంటో చూపించే అవకాశం లభిస్తుంది. కానీ ఈ టీజర్ చూసిన మాస్ మహారాజా అభిమానులైతే ఫుల్ మీల్స్ అంటూ సంబరపడుతున్నారు. రవితేజ మీసం తిప్పిన లుక్ అయితే అద్భుతంగా ఉంది.









ప్రస్తుతం పూరీ జగన్నాధ్ రాబోయే సినిమా గురించి ఎటువంటి అప్ డేట్ లేదు. పూరీ ఇప్పటివరకు తదుపరి మూవీ గురించి ఏ వివరాలను కూడా ప్రకటించలేదు. అయితే పూరీ జగన్నాధ్ తన కుమారుడు ఆకాష్ పూరీ హీరోగా, ఓ సినిమాకు దర్శకత్వం చేస్తాడని వినిపించాయి. ఆ విషయం పై ఎలాంటి సమాచారం లేదు. తాజా సమాచారం ప్రకారం పూరీ జగన్నాధ్ కొత్త ప్రాజెక్ట్ కోసం హీరో రవితేజతో చర్చలు జరుపుతున్నాడని తెలిస్తోంది.
ఇంతకుముందు పూరీ, రవితేజ కాంబినేషన్ లో పలు సూపర్ హిట్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రవితేజ పూరి దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? ఎందుకంటే రవితేజ ఒప్పుకున్న సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. మరో రెండేళ్ల వరకూ డేట్స్ ఖాళీగా లేవని వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ కెరీర్ ఎదుగుదలకు కావాల్సిన హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్ కోసం డేట్స్ తప్పకుండా ఇస్తాడని అందరు అనుకుంటున్నారు. ఇంకా చర్చల దశలో ఉన్న ఈ సినిమా, రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తుందో లేదో చూడాలి.
ఎందుకంటే ‘ఆచార్య’లో చిరంజీవి హీరోగా నటించగా, రామ్ చరణ్ ముఖ్యపాత్రలో నటించాడు. ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ‘లూసిఫర్’ రీమేక్ గా వచ్చిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటించాడు. గాడ్ ఫాదర్ కి పాజిటివ్ టాక్ వచ్చి, వసూళ్లు కూడా బాగానే ఉన్నా, ఫలితం మాత్రం హిట్ అయితే కాలేదు. రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమాలూ నిరాశపరిచాయి.దీంతో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా పరిస్థితి ఎలా ఉండబోతుందో అని మెగా ఫ్యాన్స్ కలవర పడుతున్నారు.
అమితాబ్ బచ్చన్ వీరాభిమాని అయిన రవితేజ సినిమాల్లోకి రావడానికి, కష్టపడి ఈ స్థాయికి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవే కారణం అని ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. రవితేజ ఇంతకు ముందు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ‘అన్నయ్య’ సినిమాలో మెగాస్టార్ తమ్ముడిగా నటించాడు. 20 సంవత్సరాల తర్వాత మళ్లీ చిరంజీవితో కలిసి నటిస్తున్నాడు. ఈ సినిమాలో కథను మలుపు తిప్పే ముఖ్యమైన పాత్రలో రవితేజ కనిపిస్తాడని తెలుస్తోంది.
ఈ అమ్మాయి ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని అనుకోకుండా సినీనటి అయిపోయింది. మలయాళంలో తన సినీరంగాన్ని మొదలుపెట్టారు. తెలుగులో యువసేన సినిమా ఆమెను సక్సెస్ ఫుల్ తారగా మార్చేసింది. దాదాపు 30 సినిమాల్లో మెరిసి ఒక్కసారిగా ఎందుకు తెరమరుగై పోయారు.
ఈమెకు మోహన్ లాల్,మమ్ముట్టి, చిరంజీవి అంటే చాలా ఇష్టమట. నా ప్రతిభను గుర్తించి ప్రజలు నన్ను అభిమానించారని గోపిక ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఏది ఏమైనప్పటికీ మరోసారి ఆమె తెరపై కనిపించి అందరినీ మెప్పించాలని కోరుకుందాం.