కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్ గా వచ్చిన చిత్రం సప్త సాగారాలు దాటి సైడ్ B.ఇటీవల ఈ చిత్రం విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.సైడ్ A లాగానే సైడ్ B కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయితే ఈ సినిమాలో సురభి అనే సెక్స్ వర్కర్ పాత్రలో నటించిన ఆమె మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆమె పాపులర్ కన్నడ నటి.ఆమె గురించి ఎవరికీ తెలియకపోవచ్చు కానీ, కన్నడలో మంచి సూపర్ హిట్ సినిమాలలో నటించింది. ఆమె పాపులర్ సింగర్ కు కూడా పలు సినిమాల్లో పాటలు కూడా పాడింది. ఆమె పూర్తి పేరు చైత్ర జె అచర్. ఆమె స్వస్థలం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు. 2019లో మహిరా సినిమా తోటి సినిమాల్లోకి అడుగు పెట్టింది.
దానికన్నా ముందు చిన్న చిన్న వెబ్ సిరీస్ లలో నటించింది.చైత్ర కి చిన్నప్పటి నుండి సంగీతం పైన ఉన్న ఇంట్రెస్ట్ తో కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుంది. చైత్ర ట్రెడిషనల్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఎడ్యుకేషన్ కి ఆర్ట్ కి ఆమె కుటుంబంలో మంచి విలువ ఇస్తారు.సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత మిల్కీ, అదృశ్య, టాబి సినిమాల్లో కీలకమైన పాత్రలో నటించింది.ఇదే కాకుండా ప్రస్తుతం చైత్ర లైన్ అప్ లో చాలా సినిమాలు ఉన్నాయి. రక్షిత్ శెట్టి స్టూడియోస్ లో స్ట్రాబెర్రి అనే చిత్రంలో నటిస్తుంది. ఇది కాకుండా బ్లింక్,హ్యాపీ బర్త్ డే టు మీ,యారెగు హల్బెడి చిత్రాలు రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి. సంగీతం పైన ఇంట్రెస్ట్ తో పలు సినిమాల్లో పాటలు కూడా పాడింది.కానీ అనుకోకుండా నటనలోకి అడుగుపెట్టడంతో సంగీతం పైన దృష్టి పెట్టడానికి సమయం దొరకడం లేదు. రిషబ్ శెట్టి నటించిన గరుడ గమన వృషభ వాహన సినిమాలో చైత్ర మంచి పాట కూడా పడింది. ఆమె పాడిన సోజుగాడ సోజు మల్లిగే పాట సూపర్ హిట్ అయ్యింది. ఈ పాటకి కన్నడ బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా సైమా అవార్డు కూడా అందుకుంది. తాజాగా సప్త సాగరాలు దాటి సినిమాతో కన్నడ ఇండస్ట్రీ తో పాటు తెలుగులో కూడా బాగా ఫేమస్ అయింది. ఆమె చేసిన పాత్ర చాలా రోజులు ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. చైత్ర కి తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తాయేమో వేచి చూడాలి.
Also Read:నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి… 29 రోజుల టోటల్ కలెక్షన్స్…