Tollywood: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ఇటీవల మారేడుమిల్లి అడవుల్లో ప్రారంభమైంది. ఈ సినిమాలోని నితిన్ మాస్ లుక్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటో వైరల్ గా మారింది.
ఈ ఏడాది పూజా కార్యక్రమాలతో మొదలైన నితిన్ 32వ సినిమా సినిమా షూటింగ్ ఇటీవల మారేడుమిల్లి అడవుల్లో ప్రారంభమైంది. ఈ షూటింగ్ లో పాల్గొన్న నితిన్, మారేడుమిల్లి ఫారెస్ట్ లొకేషన్లో తీసిన ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. అయితే ఈ ఫోటోలో నితిన్ గుబురు గడ్డంతో మాస్ లుక్ లో, స్టైలిష్ గాగుల్స్‌తో బ్లాక్ షర్ట్ ధరించి, చెక్క వంతెన పై నడుస్తూ సైడ్ లుక్‌లో కెమెరాకు స్టన్నింగ్ పోజ్ ఇచ్చాడు నితిన్.
హీరో నితిన్ ఒక్క లుక్ తో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని హింట్ ఇచ్చాడని ఇండస్ట్రీలో టాక్. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్లో హీరో నితిన్ పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు వంశీ అండ్ టీం. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన పెండ్లిసందడి ఫేమ్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.
మాచర్ల నియోజకవర్గం సినిమా నితిన్‌కి ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. దీంతో నితిన్ ఈసారి మంచి హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడని ఫ్రెష్ లుక్ తో చెబుతున్నాడు.నితిన్ ఈ చిత్రంలో మాస్ అవతార్‌లో కనిపించబోతున్నాడని అర్థమవుతోంది.అయితే ఈ సినిమాలో ఒక్క ఎపిసోడ్ నే ఇలా కనిపిస్తాడని, సినిమా కథ వేరని సమాచారం. నితిన్ ఒక్క సన్నివేశం కోసమే గెడ్డం పెంచాడని టాక్ వినపడుతోంది. కొన్ని రోజులు అడవుల్లో తొలి షెడ్యూలు పూర్తి చేసి, ఆ తరువాత షూటింగ్ ని హైదరాబాద్ కు షిప్ట్ చేస్తారని, ఈ గెటప్, ఈ సీన్ కు, మిగిలిన కథకు ఉన్న సంబంధం ఏమిటో తెలియాల్సి వుంది. ఈ సినిమాకు సంగీతం హారిస్ జయరాజ్ అందిస్తున్నారు.