తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన లియో సినిమా దసరా కనుక విడుదలైంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. తమిళ సూపర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ పైన ముందు నుంచి కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే లియో మూవీ అభిమానుల ఆదరణ పొందింది. అయితే లోకేష్ కనకరాజు సినిమా టికెట్ యూనివర్స్ లో వచ్చిన విక్రమ్, ఖైదీ మూవీ లతో పోలిస్తే లియో మూవీ కొంచెం వీక్ అనేచెప్పాలి.
ఈ సినిమాలో చాలా డీటెయిల్స్ మిస్సయినాయి. ఫ్యాన్స్ కి చాలా విషయాలు అర్థం కాలేదు. లొకేషన్ కావాలని అలా చేశాడా లేకపోతే మరి ఏదైనా రీజన్ ఉందా అంటూ చాలామంది క్వశ్చన్స్ చేశారు.అయితే సినిమాలో హారాలు దాస్ కి లియో దాస్ అంటే ఎందుకు అంత కోపం అంటూ లోకేష్ సరిగ్గా కన్వే చేయలేదు.
అయితే డిలీట్ చేసిన ఒక సీన్ లో మాత్రం దీనికి సరైన రీజన్ ఉందట. ఈ విషయాన్ని లియో మూవీ కెమెరామెన్ మనోజ్ పరమహంస చెప్పుకొచ్చారు.సినిమా సెకండాఫ్ లో ఆంటోనీ దాస్ తన పిల్లల్లో ఒకరిని బలి ఇవ్వాలని అనుకుంటాడు. అప్పుడు తన కూతురైన ఎలిసా దాస్ ను సెలెక్ట్ చేసుకుంటాడు.హరోల్డ్ దాస్ మాత్రం లియో దాస్. ను సెలెక్ట్ చేసుకుంటాడు.అసలు హరోల్డ్ కి లియో అంటే ఎందుకు అంత కోపమో లోకేష్ సరిగ్గా కన్వే చేయలేదు. అయితే దీనిపైన ఎవరి థియరీస్ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఆంటోనీ దాస్ తర్వాత దాస్ అనుకో ఎవరికి వెళుతుంది అని ఓటింగ్ పెడితే లియో మీద భయంతో అందరూ లియో కి ఓటు వేస్తారు.
దీంతో దీన్ని పర్సనల్గా తీసుకున్న హరోల్డ్ బలి యిచ్చే ప్రాసెస్ లో లియోని సెలెక్ట్ చేసుకుని అతనిని అంతం చేస్తే తనకి అడ్డు లేకుండా ఉంటుందని అనుకుంటాడు. నిజంగా ఈ సీను కనుక మూవీలో యాడ్ చేసి ఉంటే క్లైమాక్స్ లో హారొల్డ్ కి లియో కి మధ్య వచ్చే ఫైట్ సీన్ మరింత ఇంపాక్ట్ క్రియేట్ చేసేది. అయితే ఇలాంటి ఇంపార్టెంట్ సీన్స్ అన్నీ కూడా మూవీ రన్ టైం ఇష్యూ వల్ల డిలీట్ చేసినట్లుగా చెప్పుకొచ్చారు.
Also Read:సైలెంట్ గా స్టార్ట్ అయిన మెగాస్టార్ సినిమా షూటింగ్..