ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి.ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.ఈ జబర్దస్త్ ప్రోగ్రాం నుంచి ఎన్నో వేల స్కిట్లు, ఎందరో ఆర్టిస్టులకి లైఫ్ ఇచ్చిన వేదిక. ప్రతి గురు శుక్ర వారాల్లో తెలుగు ప్రజానీకానికి టీవీలకు అతుక్కుపోయేలా చేసే ఈ ప్రోగ్రాం. ప్రతి వారం లాగే ఈ వారం ప్రోమో కూడా వచ్చింది జబర్దస్త్ ప్రోగ్రాం లో పంచులు, ప్రాసలకి పెట్టింది పేరు హైపర్ ఆది తన పంచలకి ఆడియెన్స్ ని ఎప్ప్పటికప్పుడు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇక ఈ వారం వచ్చిన ప్రోమో లో తన స్టైల్ లో అలరించాడు హైపర్ ఆది.. మీరూ ఈ సరికొత్త ప్రోమో చూసేయండి మరి..
జబర్దస్త్
అదిరే అభి అయితే స్కిట్ అయిపోయిన సాయంకాలం కి చెక్ ఇస్తారు..మరి హైపర్ ఆది ఏంచేసాడంటే.. ?
‘జబర్దస్త్’ తెలుగు రాష్ట్రాల్లో..సంచలనమే సృష్టించిన ఒక ప్రోగ్రాం..ఎందరినో ఆర్టిస్టులను తెరపైకి తెచ్చి.వారి టాలెంట్ ని నిరూపించుకునేలా చేసిన ఒక స్టేజ్..బుల్లి తెర నుంచి వెండి తెర కి ప్రమోట్ అయ్యారు కొందరు కమెడియన్స్..తాగుబోతు రమేష్,హైపర్ ఆది,అదిరే అభి,సుడిగాలి సుధీర్,గెటప్ శ్రీను,ఆటో రామ్ ప్రసాద్,మహేష్ ఆచంట..మరెందరినో టాలీవుడ్ కి పరిచయం చేసింది..వీరిలాగే…మరెందరో వారి టాలెంట్ ని నిరూపించుకోవాలని ఎదురు చూస్తున్నారు.!
హైపర్ ఆది స్కిట్స్ లో బాగా ఫేమస్ అయిన గణపతి మాస్టర్ తన జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలను…జబర్దస్త్ కి పరచియం ఎలా అయ్యారని..ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెల్లడించారు..గణపతి మాస్టర్ నేటివ్ ప్లేస్ శ్రీకాకుళం వృత్తి పరంగా ఆయన ఒక టీచర్..నటన మీద ఆసక్తి ఉండటం తో జాబ్ మానేసి హైదరాబాద్ కి వచ్చేసారు..కొత్త వేషాల అన్వేషణలు చేసే వాళ్లంతా శ్రీ శ్రీ హోటల్ దగ్గర కలిసేవారట.అమన్ అనే వ్యక్తి ద్వారా ఏర్పడిన పరిచయం ద్వారా మొదట షార్ట్ ఫిలిమ్స్ లో నటించే అవకాశం వచ్చిందట..
లావుగా మరి పొట్టిగా ఉన్న వారి కోసం చూస్తున్న తరుణం లో గణపతి మాస్టర్ ఎదురయ్యారు.ఆలా తొలి అవకాశం దక్కించుకున్నారు.అమన్ ద్వారా మరో సినిమా నటించే అవకాశం కూడా వచ్చిందట లవ్ యూ బంగారం సినిమాలో ఛాన్స్ కొట్టేసారు.అటు తరువాత షకలక శంకర్ ని కలవటం..ఆయన టీం లీడర్ కావటంతో మొదటి ఆఫర్ ఆలా దక్కించుకున్నారు.రెండు సంవత్సరాల పాటు షకలక శంకర్ తో కలిసి పని చేసిన తరువాత సినిమాలో బిజీ కారణంగా షకలక శంకర్ జబర్దస్త్ ని వదిలేయటం తో గణపతి మాస్టర్ ఆర్థికంగా కూడా సంపాదన ఎంతో అవసరం ఉండటంతో జబర్దస్త్ ని వదలలేక పోయారు..
అదిరే అభి ని కలసిన గణపతి మాస్టర్..హైపర్ ఆది కి గణపతి మాస్టర్ ని పరిచయం చేయటం తో స్క్రిప్ట్ లోని డైలాగ్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేయమనేవారట..అదిరేఅభి స్కిట్ అయిపోయిన సాయంకాలానికి బిర్యానీ తినిపించి మరీ చెక్ ఇచ్చేవారట..ఆలా ఆది జబర్దస్త్ లో గణపతి మాస్టర్ కి సహాయం చేశారట..గణపతి మాస్టర్ తొలి స్కిట్ చేస్తే వచ్చిన డబ్బు వెయ్యి రూపాయలట.
తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గురు,శుక్రవారాల్లో రాత్రి 9: 30 అయ్యిందంటే చాలు.తెలుగు ప్రేక్షలకులు అందరూ టీవీలకు అత్తుకుపోతారు కారణం బుల్లి తెర సంచలనం ‘జబర్దస్త్’ బహుశా ఈ పేరు తెలుగువాళ్ళలో తెలియనివారు ఉండరేమో..స్కిట్స్ లో వచ్చే కామెడీ అంటే అంత ఇష్టం మరి.సినిమా హీరోలకి ఉండే ఫ్యాన్ ఫాలోవింగ్ వీరికి ఉందంటే అది ముమ్మాటికీ నిజం.
వీరిలో హైపర్ ఆది.,గెటప్ శ్రీను,సుడిగాలి సుధీర్ .స్కిట్స్ అంటే ఎంత ఇష్టమో ప్రతి ఒక్కరికి తెలుసు..వీరు సోషల్ మీడియా లో కూడా యాక్టీవ్ గా ఉంటారు తరచూ వారితో చాట్ చేస్తూ.వారికి సంబంధించి పోస్టులు పెడుతూ అలరిస్తూ ఉంటారు..ఆటో రామ్ ప్రసాద్ గా పేరు తెచ్చుకున్న రామ్ ప్రసాద్ తన ఆటో పంచులు తన ఫేస్బుక్ పేజ్ ద్వారా కూడా పేలుస్తూ ఉంటాడు.
వీరి స్కిట్ లో ఉండే సన్నీ అందరికి గుర్తు ఉండే ఉంటారు..తన పుట్టిన రోజు అయినా ఇవాళ గెటప్ శ్రీను ‘సన్నీ’ కి విష్ చేస్తూ పోస్ట్ చేసారు.ఆ పోస్ట్ ఇప్పుడు ఫేస్బుక్ మొత్తం వైరల్ అయ్యింది ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే…’పుట్టిందేమో శ్రీకాకుళం .. కానీ పక్కా హైదరాబాదీలెక్క వుంటాడు …వయసేమో …. .. కానీ 20 లెక్క కటింగ్ ఇస్తాడు హాఫ్ …… సెంచురీ చేస్తాడు కానీ బాటింగ్ రానట్టే ఉంటాడు .. వాడి ఫ్యామిలీకి సునీల్ చంద్ర … మనకి సెక్సీసన్నీ …..
ఈరోజే పుట్టాడు … ఒరేయ్ సన్నా హ్యాపీ బర్త్డే రా లవ్ యూ’ అంటూ పోస్ట్ చేసారు జబర్దస్త్ శ్రీనివాస్.
ప్రపంచ దేశాలని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ప్రజల కష్టాలు వర్ణనాతీతం..లాక్ డౌన్ కారణంగా యావత్ ప్రజానికం ఇళ్లకే పరితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది..ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలని …ప్రజానికాన్ని కుదిపేస్తున్న ఈ మహమ్మారి వలన ఎందరో పని లేకుండా అలమటిస్తున్నారు..చిన్న పెద్ద తేడా లేకుండా, ప్రతి ఒక్కళ్లని పట్టి పీడిస్తుంది..కరోనా మహమ్మారి..ఇకపోతే మన దేశానికి ….పెద్ద మహమ్మారిలా మారింది లాక్ డౌన్ కారణంగా అటు సినీ రంగం..ఇటు టీవీ రంగం కూడా షూటింగ్స్ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది..తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియదు..ఇలాంటి వృత్తినే నమ్ముకున్న ఆర్టిస్టుల కష్టాలు అన్ని ఇన్ని కావు..వేళ్ళని ఆదుకోవడనికి ఇంకా ఎవ్వరు ముందు రాలేదు.ఇక బుల్లి తెర సంచలనం ‘జబర్దస్త్’ ఎంత పేరు ని సంపాదించుకుందో అందరికి తెలియనిది కాదు.స్కిట్ ల మీదే ఆధార పడి బ్రతుకుతున్న వారు ఎందరో…వీరిలో ఒకరు అయిన జబర్దస్త్ కమెడియన్ జీవన్ తన రైతు వృత్తినే ఎన్నుకున్నారు.
తనకు సంబందించిన భూముల్లో వ్యవసాయ పనులు చేసుకుంటూ వారి పంట కోతల తరువాత వడ్లను తూర్పూరపడుతూ ఒక వీడియో ను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేసాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్ ఇంట వైరల్ గా మారింది జబర్దస్త్ లోని చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ టీంలలోనే కాకుండా..ప్రముఖ టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే ప్రోగ్రామ్స్ లో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మొదుట తాను సంగీత దర్శకుడిగా ఎదగాలి అనుకున్నారట.ఇప్పటికి ఆ కోరిక బలంగానే ఉందట ఎప్పటికైనా మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకుంటానని పలు ఇంటర్వ్యూ లలో తెలిపారు.