1903 అప్పటి “తాజ్ హోటల్” రూమ్ బిల్..! అప్పట్లో రూమ్ ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

1903 అప్పటి “తాజ్ హోటల్” రూమ్ బిల్..! అప్పట్లో రూమ్ ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Mounika Singaluri

Ads

ముంబయిలోని గేట్‌వే ఆఫ్ ఇండియాకి ఎదురుగా ఉన్న తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌ను అందరూ తాజ్ హోటల్ అనే పిలుస్తారు. సహజంగా గేట్‌వే ‌ఆఫ్ ఇండియాని చూడటానికి వచ్చిన వారంతా ఈ తాజ్ హోటల్‌ ఎదురుగా నిల్చొని కూడా ఫొటోలు దిగుతుంటారు. ముఖ్యంగా 2008లో భీకరమైన ఉగ్రదాడులను తట్టుకొని మరీ ఈ హోటల్ తిరిగి సగర్వంగా నిలిచింది. ఇప్పుడు కూడా ముంబయిని సందర్శించడానికి వచ్చే వారికి ఆతిథ్యం అందిస్తోంది.

Video Advertisement

ఈ తాజ్ హోటల్‌ను 1903లో జెమ్‌సెత్‌జీ టాటా ముంబయిలోని కొలాబా అనే ప్రాంతంలో అరేబియా సముద్ర తీరానికి ఎదురుగా అత్యంత అందంగా, గొప్పగా, అర్థవంతంగా తీర్చిదిద్దారు. అది 120 సంవత్సరాలుగా అక్కడికి వచ్చే పర్యాటకులకు విశేష సేవలు అందిస్తూ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈ తాజ్ హోటల్ నిర్మించిన జెమ్‌సెత్‌జీ టాటాని కూడా బ్రిటన్‌లో తీవ్రంగా అవమానించారు. అక్కడ ఓ హోటల్ లో భారతీయులకు ప్రవేశం లేదని చెప్పగా అది వ్యక్తిగతంగా తానొక్కడికే జరిగిన అవమానంగా భావించకుండా భారతీయులందరికీ జరిగిన అవమానంగా భావించారు. దీంతో భారత్‌లో ఎలాగైనా అతి గొప్ప హోటల్ నిర్మించాలని అనుకున్నారు.

old rates of rooms in taj hotel shared by anand mahindra..

అలాగే తాజ్ హోటల్ ప్రపంచం లోని గొప్ప హోటల్స్ లో ఒకటిగా నిలిచింది . అయితే ఇక్కడ బస చేయడం సామాన్యులకు వీలు కాదు. అంత ఎక్కువగా ఉంటాయి ధరలు. ఒక రాత్రి మనం అక్కడ బస చేసేందుకు లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ హోటల్ ని ప్రారంభించిన సమయం లో ఆ హోటల్ లో బస చేసేందుకు అయ్యే ఖర్చు కేవలం 6 రూపాయలు మాత్రమే. దాని ప్రకటనలో ఈ మేరకు రాసి ఉంది. ఈ హోటల్ 1903 డిసెంబర్ 1న ప్రారంభం అయింది. అప్పుడు ఇచ్చిన ప్రకటనలో తాజ్ హోటల్ లో ఒక రాత్రికి 6 రూపాయలు రుసుము అని పేర్కొని ఉంది.

old rates of rooms in taj hotel shared by anand mahindra..

దీన్ని సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఒకసారి షేర్ చేయడం తో వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో ఆయన అందరికి ఒక సూచన చేసారు. ”ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది. టైమ్ మెషీన్‌లోకి వెళ్లి తిరిగి వెనక్కి వెళ్లండి.” అంటూ ఆయన చేసిన సూచన కూడా నెటిజన్లకు భలే నచ్చేసింది.


End of Article

You may also like