Ads
భారత దేశంలోనే కాకుండా ప్రపంచ మొత్తంలో కూడా ఉన్న బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఒకటి తాజ్ మహల్. తాజ్ మహల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. షాజహాన్ తనకి ముంతాజ్ పై ఉన్న ప్రేమకు గుర్తుగా ఈ తాజ్ మహల్ నిర్మించారు. వేరే దేశంలో ఉన్న వాళ్లకు కూడా భారతదేశం అంటే టక్కున గుర్తుకు వచ్చేది తాజ్ మహల్.
Video Advertisement
అందుకే ఎన్నో దేశాల నుండి ఎంతో మంది ప్రజలు తాజ్ మహల్ ని చూడడానికి వస్తూ ఉంటారు. ఏ రోజైనా సరే తాజ్ మహల్ దగ్గర సందర్శకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా?
సాక్షి కథనం ప్రకారం తాజ్ మహల్ లో ఓ 22 గదులు మూసివేసి ఉంటాయి. వాటిల్లో ఏమి ఉంటాయో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఇటీవల ఆ 22 గదులను తెరపించాలంటూ వేసిన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ తిరస్కరించింది. దీనితో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. ఈ పిటిషన్ విచారణకు రాకముందే న్యూస్ లెటర్ జనవరి 2022 పేరిట తాజ్ మహల్ లో మరమ్మత్తులు జరుగుతున్న తాలూకు ఫోటోలను ఆర్కియాలజీ సర్కే ఆప్ ఇండియా(ఏఎస్‌ఐ) సోషల్ మీడియాలో హేండిల్ లో విడుదల చేసింది.
దీనితో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజ్ మహల్ పునరుద్ధరించడానికి ముందు ఫోటోలు, తరువాత ఫోట్లను ఏఎస్ఐ విడుదల చేసింది. సున్నపు ప్లాస్టర్ రీప్లాస్టర్‌గా స్క్రాప్ చేయడం, గోడలను, మెట్లను మర్రమ్మత్తులు చేయడం వంటి ఫోటోలను కూడా విడుదల చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. తాజ్ మహల్ బయటి వైపున, యమునా నది ఒడ్డున జరుగుతున్న మరమ్మత్తు పనుల తాలూకు ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను మీరు కూడా ఈ కింద ట్వీట్ లో చూసేయచ్చు.
Click on the link to download/view the January issue of @ASIGoI's Newsletter.https://t.co/tIJmE46UR4 pic.twitter.com/UKWsTA2nPZ
— Archaeological Survey of India (@ASIGoI) May 9, 2022
End of Article