Ads
ఊబకాయం, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు ఈ రోజుల్లో సర్వసాధారణం మారాయి. అసలు మన అలవాట్లతోనే ఇలా జరుగుతోందని చాలా మందికి అర్థం కాదు. ఎసిడిటీ, మలబద్ధకం వల్ల బరువు పెరగడం మొదలవుతుంది. ఇవన్నీ మన చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల ఫలితమేగా ఇలా జరుగుతుంది.
తప్పుడు అలవాట్లకు దూరంగా ఉంటూ మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇందులో ముఖ్యమైనది రోజు మనం తినే ఆహారం. ఇందులో మనం తెలుసుకోవల్సినది ఆహారం తిన్న తర్వాత.. ఆహారం తినక ముందు ఏం చేయాలో తెలుసుకోవాలి. ఆహారం తిన్న తర్వాత స్నానం చేయడం, పండ్లు తినడం, వ్యాయామం చేయడం వల్ల మన ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి.
Video Advertisement
మీరు భోజనం లేదా అల్పాహారం తీసుకున్న వెంటనే స్నానం చేయడం అస్సలు మంచిది కాదు. ఈ సంగతి చాలా కాలంగా మన ఇంట్లోని పెద్దలు చెప్తూనే ఉంటారు. అందుకే స్నానం చేసిన తర్వాతే భోజనం చేయాలని సూచిస్తారు. దాని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది.
భోజనం చేశాక మన శరీరంలో రక్తం ఎక్కువగా జీర్ణాశయానికి సరఫరా అవుతుంది. ఎందుకంటే తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేందుకు కూడా శక్తి అవసరం. కనుక ఆ శక్తిని అందించేందుకు జీర్ణాశయానికి ఎక్కువగా రక్తం సరఫరా అవుతుంది. అయితే తిన్న వెంటనే స్నానం చేస్తే అప్పుడు మన శరీర ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. దీన్ని మెదడు వెంటనే గుర్తించి శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించే పనిలో పడుతుంది. అప్పుడు రక్తం మన జీర్ణాశయానికి కాక చర్మం వైపు సరఫరా అవుతుంది. దీంతో జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది.
ఒక వేళ మనం తిన్నాక చన్నీళ్ల స్నానం చేస్తే అప్పుడు రక్త నాళాలు వెడల్పు అవుతాయి. దీంతో పెద్ద ఎత్తున రక్త సరఫరా జరుగుతుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకుంటుంది. అదే వేన్నీళ్ల స్నానం చేస్తే అప్పుడు చర్మంలో ఉన్న రక్త నాళాలు పెద్దవిగా అయి అవి ఎక్కువ ఉష్ణాన్ని చర్మం ద్వారా బయటికి పంపుతాయి. దీంతో శరీరం సాధారణ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది.
ఈ ప్రక్రియ ముగిసేంత వరకు జీర్ణాశయానికి రక్తం సరిగ్గా అందదు. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. అందుకే అలా సమస్యలు రాకుండా ఉండడం కోసమే తిన్న వెంటనే స్నానం చేయకూడదని చెబుతారు. అలాగే తిన్న వెంటనే పండ్లు తినడం, వ్యాయామం చేయడం, ధూమపానం చేయడం, నిద్రపోవడం వంటివి కూడా మంచి అలవాట్లు కావు.
End of Article