అందరూ ఏఆర్ రెహమాన్ కి మద్దతు పలుకుతూ ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు..! విషయం ఏంటంటే..?

అందరూ ఏఆర్ రెహమాన్ కి మద్దతు పలుకుతూ ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు..! విషయం ఏంటంటే..?

by kavitha

Ads

లెజెండ‌రీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  రెహమాన్  లైవ్ కన్సర్ట్ ఉందంటే అక్కడ ఇసుక వేసిన రాలనంత ప్రజలు హాజరువుతారనే విషయం తెలిసిందే. అభిమానులు అయితే సునామిలా ఆ కన్సర్ట్ లో పోటెత్తుతుంటారు.

Video Advertisement

తాజాగా రెహమాన్ చెన్నైలో లైవ్ కన్సర్ట్ లో పాల్గొన్నారు. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ గా పేరుగాంచిన ఈ  కన్సర్ట్ కి అనూహ్య స్పందన వచ్చింది. భారీగా జనాలు రావడంతో తీవ్ర గంద‌ర‌గోళం ఏర్పడింది. ఈ తొక్కిసలాటలో చాలా మంది గాయపడ్డారు. దాంతో రెహమాన్  పై సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సెప్టెంబర్ 10న చెన్నైలో నిర్వహించిన ‘మరక్కుమా నెంజమ్’ కాన్సర్ట్ లో ఏఆర్ రెహమాన్ పాల్గొన్నారు. సహజంగానే భారీగా జనాలు హాజరవుతారు. ఈ కన్సర్ట్ కూడా భారీ జనసందోహం రావడంతో తొక్కిసలాట జరిగింది. ఇందులో చాలామంది గాయపడ్డారు. మహిళలు మరియు పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతూ, రెహమాన్ విమర్శలు చేస్తూ, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వేలకు వేలు పెట్టి, టికెట్లు కొనుగోలు చేస్తే లోపలికి కూడా వెళ్లనివ్వలేదని, తొక్కిసలాటలో ఎవరైనా మరణిస్తే ఎవరిది బాధ్యత అంటూ రెహమాన్ పై విరుచుకుపడుతున్నారు. తాజగా తన పై, కన్సర్ట్  పై వస్తోన్న విమర్శల పై రెహమాన్ స్పందించి, క్షమాపణలు చెప్పాడు. అలాగే తన కాన్సర్ట్‌కు చూడలేకపోయిన, రాలేకపోయినా  వారందరి డబ్బులు తిరిగి ఇస్తామని ప్రకటించాడు. జరిగిన మిస్టేక్ ను ఎవరో ఒకరి మీద వేయాలని అనుకోవడం లేదని రెహమాన్ చెప్పారు.
కన్సర్ట్ కి 46 వేల మంది వస్తారని నిర్వాహకులు అంచనా వేశారని, దానికి అనుగుణంగానే సీటింగ్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. అయితే ఆ సీటింగ్ నిండిపోయిందని, ఆ తరువాత ప్రోగ్రాం ప్రారంభించామని తెలిపారు. స్టేజ్ పైన పాటలు పాడుతున్నానని, వెలుపల ఏం జరుగుతుందో  తెలియలేదని అన్నారు. ఇక పై ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తపడతానని, ముఖ్యంగా పిల్లల, మహిళల సేఫ్టీ పై మరింత దృష్టి పెడతాము అని రెహమాన్ వెల్లడించాడు.

Also Read: “పుష్ప” టీమ్ ని ట్రోల్ చేస్తున్న నెటిజెన్లు..! కారణం ఏంటంటే..?

 

 


End of Article

You may also like