‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్స్ క్యాంపైన్ పై విమర్శలు గుప్పించిన “తమ్మారెడ్డి భరద్వాజ”..!!

‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్స్ క్యాంపైన్ పై విమర్శలు గుప్పించిన “తమ్మారెడ్డి భరద్వాజ”..!!

by Anudeep

Ads

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటారు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ఈ సినిమా, ఏకంగా రూ. 1200 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పటికే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సినిమా అవార్డులను అందుకున్న ఈ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచింది.

Video Advertisement

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ సినిమాకు చెందిన ‘నాటు నాటు’ పాట నామినేట్ అయ్యింది. అయితే ఈ చిత్రం మన దేశం నుంచి అధికారికంగా ఆస్కార్స్ కి పంపలేదు. దీంతో ర్ ఆర్ ఆర్ చిత్రం ఇండివిడ్యుయల్ గా ఆస్కార్ అవార్డు కోసం అప్లై చేసింది కాంపెయిన్ స్టార్ట్ చేసింది.

 

 

అయితే రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఆస్కార్ మరియు గోల్డెన్ గ్లోబ్స్ క్యాంపైన్ కోసం రూ. 83 కోట్ల ని ఖర్చు చేసిందని సమాచారం. అయితే తొలిసారి ఒక తెలుగు సినిమా ఆస్కార్‌కి అడుగు దూరంలో నిలిచింది. మార్చి 12న ఒక‌వేళ ఆస్కార్ వ‌స్తే మాత్రం తెలుగు వాళ్ల‌మైనంద‌కు మ‌నం మ‌రింత‌గా గ‌ర్వ‌ప‌డొచ్చు. అయితే మరో వైపు తాజాగా సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ప్రొడ్యూస‌ర్ త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాత్రం ఆర్ఆర్ఆర్ పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది.

Tammareddy bharadwaj about RRR oscar campain..!!

తాజాగా హైదరాబాద్ రవీంద్రభారతి ప్రివ్యూ థియేటర్‌ లో ‘వివాదాస్పద విషయాలపై సినిమాల నిర్మాణం’ అనే అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న భరద్వాజ పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా బృందం ఆస్కార్ కోసం చేస్తున్న ఖర్చుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. “ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రూ. 600 కోట్ల బడ్జెట్ అయింది. మళ్లీ ఆస్కార్ కోసం రూ.80 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ 80 కోట్లు మాకు ఇస్తే ఓ 8 సినిమాలు తీసి వాళ్ళ మొఖాన కొడతాం” అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

Tammareddy bharadwaj about RRR oscar campain..!!

ప్రస్తుతం ప్రస్తుతం సినీ పరిశ్రమతో పాటు సినిమా వ్యాపారంలో సామాజిక స్పృహా లోపించిందని భరద్వాజ అభిప్రాయపడ్డారు. సినిమాలను తీసేది ప్రేక్షకులకు ఏదో నేర్పించాలని, వాళ్లను మార్చాలని కాదని చెప్పారు. మనకు నచ్చినట్లు మనం సినిమా తీయాలన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలను తాము చేయలేమని, కేవలం చూస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం భరద్వాజ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


End of Article

You may also like