రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రస్తుతం ఆస్కార్ కి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ గెలిచేందుకు మూవీ టీం గత కొంత కాలంగా అమెరికాలో ప్రమోషన్స్ నిర్వహిస్తూ వస్తున్నారు. కాగా ఈ ప్రమోషన్స్ గురించి టాలీవుడ్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ మూవీ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం రాజమౌళి 80 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాడు. అంటూ వ్యాఖ్యలు చేయడం తో ఈ వ్యాఖ్యలు కాస్త టాలీవుడ్ వివాదానికి దారి తీశాయి.
Video Advertisement
ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు.. తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే నాగబాబు తనపై చేసిన వ్యాఖ్యలకు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఓక వీడియో ని విడుదల చేసారు. ఆ వీడియో లో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ సీరియస్ అయ్యారు.
” ఒక సెమినార్ లో భాగంగా పరిశ్రమకు రావాలి అనుకుంటున్న కొంతమంది స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే రిలీజ్ అయ్యాక పేరు వచ్చే సినిమాలు, రిలీజ్ కి ముందే పేరు సంపాదించే సినిమాలు, అవార్డులు, రివార్డులు కోసం తీసే సినిమాలు అంటూ వివరణ ఇచ్చే సమయంలో.. ప్రస్తుతం RRR మూవీ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం 80 కోట్లకు ఖర్చు చేస్తుంది అంటూ వ్యాఖ్యానించాను. కానీ ఆ ముందు మాట్లాడిన మాటలు ఏమి పట్టించుకోకుండా, కేవలం ఖర్చు చేశారు అనే ఒక పదాన్ని తీసుకోని పలువురు ప్రముఖులు కూడా అకౌంట్స్ తెలుసా, అమ్మా మొగుడు ఖర్చు చేశాడు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
నేను ఏ తప్పు చేయలేదు. క్షమాపణ చెప్పను. రెండు రోజుల క్రితం కూడా ఈ సినిమా దేశానికి గర్వ కారణం అంటూ రాజమౌళి గొప్పతనాన్ని తెలియజేస్తూ వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. కానీ మూడు గంటల సెమినార్ లో కొద్దిపాటి ఆడియో ఎడిటింగ్ చేసి దాని మీద నిందలు వేయటం తగదు.” అని తమ్మారెడ్డి ఆ వీడియో లో మాట్లాడారు.
అంతే కాకుండా.. అసభ్య పదజాలాలు వాడటం తనకు తన తండ్రి నేర్పలేదని ఆయన అన్నారు. “నేనేం తప్పు చేయలేదు. నేను నోరు విప్పితే చాలా వుంటాయి. విప్పాల్సిన అవసరం లేదు. ఇంతకాలం మనమంతా ఒక్కటే అని ఫీల్ అయ్యాను. ఇప్పుడూ ఫీల్ అవుతున్నా. మీకు సిగ్గు లేకపోతే నాకు సిగ్గు లేకుండా ఉండలేను. నాకు సిగ్గు, మానం, అభిమానం అన్నీ వున్నాయి.” అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది.