Ads
నేడు చాలా మందికి దేవుడు లేడు, అదంతా బూటకం అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది. అయితే అలాంటి వాళ్ళకి సరైన సమాధానం చెప్పే గుడి ఒకటి రాజస్థాన్ లో ఉంది. మానవ శక్తికి అతీతమైన శక్తి ఏదో ఉంది అనటానికి ఈ గుడి పెద్ద ఉదాహరణ. ఈ విషయాన్ని ఇటు ఇండియా అటు పాకిస్తాన్ ఆర్మీ వారు కూడా గుర్తించారు. ఇంతకీ ఆ గుడి ఎవరిది, ఎక్కడ ఉంది అనే విషయాలు తెలుసుకుందాం.
Video Advertisement
రాజస్థాన్లోని జై సల్మేర్ లోని ధార్ ఎడారి కి సమీపంలో సిద్ధ తనోత్ రాయ్ మాత ఆలయం ఉంది. 1965,1971 యుద్ధాల సమయంలో జై సల్మేర్ లోని భారతదేశం పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ అనేకసార్లు ఈ ఆలయం పై బాంబులు విసిరింది కానీ ఒక్కటి కూడా పేలలేదు. ఆ బాంబులు అన్నీ ఇండియన్ ఆర్మీ అదే ఆలయంలోని మ్యూజియంలో ఉంచింది. ఇలా ఈ ఆలయం పై పాకిస్తాన్ ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా వేలసార్లు ఇలాంటి దాడికి పాల్పడింది.
ప్రతిసారి ఓటమి చవిచూచింది. తనోత్ రాయ్ మాత యుద్ధ సమయంలో భారత సైనికులకు సహాయం చేసిందని చాలామంది నమ్ముతారు. ఈ కారణంగానే పాకిస్తాన్ సైన్యం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. 1965 లో జరిగిన ఇండోపాక్ యుద్ధ సమయంలో ఈ ఆలయం పై పాకిస్తాన్ సుమారు 3000 బాంబులు ఉపయోగించింది. అయితే ఒక్క బాంబు కూడా పేలక పోవటం విశేషం. ఆలయం పై ఒక గీత కూడా పడలేదు.
అదే సమయంలో పాకిస్తాన్ కి గణనీయమైన నష్టం కూడా కలిగింది. యుద్ధం ముగిసిన తర్వాత బిఎస్ఎఫ్ ఈ ఆలయాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు అక్కడ నిర్వహణ అంతా బిఎస్ఎఫ్ చేతుల్లోనే ఉంది. ఇక్కడ పూజ చేసే పూజారి సైతం సైనికుడే కావటం విశేషం. మరొక విశేషం ఏమిటంటే ఈ ఆలయానికి మానవాతీత శక్తి రక్షణ ఇస్తుంది అని ఇటు భారత సైనికులే కాదు అటు పాకిస్తాన్ సైనికులు కూడా విశ్వసిస్తారు.
End of Article