నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు . గత శుక్రవారం కుప్పంలో టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్రకి హాజరైన తారకరత్న కొద్దిసేపు నడవగానే తీవ్ర అస్వస్థకు గురై స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి తరలించగా వైద్యులు గుండెపోటు వచ్చిందని నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం ఆయన భార్య అలేఖ్య రెడ్డి కోరిక మేరకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.

Video Advertisement

 

తారకరత్న వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. తారకరత్న భార్య పేరు అలేఖ్య రెడ్డి . పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వీరి పెళ్లి గురించి అలేఖ్య రెడ్డి మాట్లాడుతూ..” తారకరత్న చెన్నైలో తన సోదరికి స్కూల్ లో ఆమెకి సీనియర్ . ఆ తర్వాత కామన్ ఫ్రెండ్ ద్వారా హైదరాబాద్ లో కలిసాం. మొదట ఇద్దరం స్నేహితులుగా ఉన్నాం.ఆ తర్వాత తారకరత్న ప్రపోజ్ చేయడం తో .. కుటుంబ సభ్యులతో మాట్లాడమని చెప్పా.. కానీ సినిమా ఇండస్ట్రీ పై మంచి అభిప్రాయం లేకపోవడంతో మా పెళ్ళికి మా ఇంట్లో ఒప్పుకోలేదు. తారక రత్న ఇంట్లో కూడా నాకు విడాకులు అయినా కారణం గా మా పెళ్ళికి ఒప్పుకోలేదు.” అని అలేఖ్య తెలిపారు.

twists in tarakaratna love story..

తర్వాత వీరిద్దరూ 2012 ఆగస్టు 2న హైదరాబాదులోని సంఘీ టెంపుల్లో వివాహం చేసుకోగా.. పెళ్ళికి ఇరు కుటుంబాల నుండి ఎవరూ హాజరు కాలేదని తెలిపారు అలేఖ్య రెడ్డి. 2013లో ఈ జంటకు నిష్కా అనే పాప జన్మించింది. ఇకపోతే వివాహం జరిగిన తర్వాత చాలా సంవత్సరాల పాటు వీరు తమ కుటుంబాలకు ఒంటరిగా జీవించాల్సి వచ్చింది. కానీ నాలుగేళ్ల తర్వాత తారకరత్న బర్త్ డే సందర్భంగా అందరూ కలిసినట్లు అలేఖ్య రెడ్డి వెల్లడించారు.

twists in tarakaratna love story..

పైకి చాలా సింపుల్ గా కనిపించే తారక రత్న వ్యక్తి గతంగా.. వృత్తి పరం గా ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్నారని తెలుస్తోంది. దీంతో ఆయన త్వరగా కోలుకొని.. ఆరోగ్యంగా తిరిగి రావాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు బెంగళూరుకి చేరుకున్నారు. గత శుక్రవారం నుంచి నందమూరి బాలకృష్ణ స్వయంగా తారక రత్న చికిత్స ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నారు.