ప్రముఖ టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న కన్నుమూసిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారక రత్న గుండెపోటుకు గురయ్యారు. గుండెపోటుకు గురైన ఆయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి బెంగళూరు లో తుది శ్వాస విడిచారు. ఇది నందమూరి ఫ్యామిలీతో పాటు అభిమానులను తీవ్ర విషాదంలో ముంచింది. ఇప్పటికీ చాలామంది తారకరత్న మన మధ్య లేడంటే జీర్ణించుకోలేకపోతున్నారు.
Video Advertisement
అయితే తారక రత్న గుండెపోటు వచ్చి కుప్పకూలాడు అని తెలియగానే బాలయ్య తల్లడిల్లాడు. కుప్పం నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయలో చేర్పించే వరకూ బాలయ్య విశ్రమించలేదు. హస్పిటల్‌లో డాక్టర్లతో తరచుగా మాట్లాడుతూ.. మెరుగైన చికిత్స అందేలా బాలయ్య జాగ్రత్తలు తీసుకున్నారు. ఇన్ని రోజులుగా తరచూ బెంగళూరు వెళ్తూనే ఉన్నారు బాలకృష్ణ. తారకరత్న క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ.. చిత్తూరు జిల్లా బత్తలాపురంలోని మృత్యుంజయ స్వామి ఆలయంలో అఖండ జ్యోతిని వెలిగించారు.
నిత్యం తారక రత్న స్పృహ లో లేకపోయినా.. అతడితో మాట్లాడుతూ ధైర్యాన్ని నింపేవారు బాలయ్య. పెళ్లి చేసుకొని కుటుంబానికి దూరమైన తారకరత్నని కుటుంబానికి చేరువ చేసేందుకు బాలయ్య ప్రయత్నించారు. ఇక చివరికి అతడు మరణించిన తర్వాత అంత్యక్రియల సమయం లోను తన అన్న మోహనకృష్ణకు ముందు నడుస్తూ.. చితి చుట్టూ తిరిగారు బాలకృష్ణ. ఇన్ని రోజులుగా బాలయ్య వేదనని చూసిన అందరికి తారకరత్న పట్ల బాలయ్యకు ఎంత ప్రేమ ఉందనేది మాత్రం అర్థమైంది.
ఇక తాజాగా తారక రత్న భార్య అలేఖ్య తమ ఫ్యామిలీ కోసం బాలయ్య ఏం చేశారో చెబుతూ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. “మేము కుటుంబమని చెప్పుకొనే ఏకైక వ్యక్తి. మంచి చెడుల్లో చివరి వరకు శిలలా నిలిచిన ఏకైక వ్యక్తి.. తండ్రిలా హాస్పిటల్‌లో చేర్పించారు. బెడ్‌పై పక్కనే కూర్చుని తల్లిలా జోల పాడారు. సిల్లీ జోక్స్ చెప్తూ తనలో కదలిక తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. చుట్టూ ఎవరూ లేనప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు’ అని బాలకృష్ణ గురించి చెప్పుకొచ్చింది అలేఖ్య. అలాగే నువ్వు ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేది ఓబు (తారకరత్న).. ‘వి మిస్ యూ’ అని నోట్‌లో పేర్కొంది.
ఇక బాలయ్య ఒళ్లో ఇద్దరు పిల్లలు కూర్చుని ఉన్న పిక్‌లో తారకరత్నను యాడ్ చేస్తూ ఎడిట్ చేసిన ఒక ఫోటోని ఆమె ఈ పోస్ట్ కి యాడ్ చేసారు. ఈ ఎడిట్ చేసిన వారికి అలేఖ్య రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక తారక రత్నకి బాబాయ్ బాలకృష్ణ అంటే ప్రాణం కన్నా మిన్న. బాబాయ్ పై అంత ప్రేమ కురిపిస్తాడు. బాలకృష్ణ అంటే ఒక సింహం లాంటి మనిషి. కాబట్టి సింహం బొమ్మని టాటూగా వేయించుకుని దాని కింద బాలకృష్ణ సంతకాన్ని కూడా టాటూగా వేయించుకున్నాడు.