“ఇంకొక సారి ఏడిస్తే..?” అంటూ… “తారకరత్న” కూతురి ఎమోషనల్ లెటర్..!

“ఇంకొక సారి ఏడిస్తే..?” అంటూ… “తారకరత్న” కూతురి ఎమోషనల్ లెటర్..!

by Anudeep

Ads

ప్రముఖ టాలీవుడ్‌ హీరో నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న కన్నుమూసిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారక రత్న గుండెపోటుకు గురయ్యారు. గుండెపోటుకు గురైన ఆయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి బెంగళూరు లో తుది శ్వాస విడిచారు. ఇది నందమూరి ఫ్యామిలీతో పాటు అభిమానులను తీవ్ర విషాదంలో ముంచింది. ఇప్పటికీ చాలామంది తారకరత్న మన మధ్య లేడంటే జీర్ణించుకోలేకపోతున్నారు.

Video Advertisement

ఇంత చిన్న వయసులో ఆయన తమని విడిచి వెళ్లడాన్ని వారి కుటుంబ సభ్యులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆయన సతీమణి అలేఖ్యా రెడ్డి నిత్యం భర్తతో గడిపిన మధురజ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుని కన్నీరుమున్నీరవుతోంది. ఆమెను ఓదార్చాడం ఎవరి తరం కావడం లేదు. ఆయన్ని మర్చిపోలేక.. తన ఆవేదనను సోషల్‌ మీడియాలో కూడా షేర్‌ చేసుకుంటోంది. వాలంటైన్స్‌డే రోజున తారకరత్న రాసిన ప్రేమలేఖ, తిరుమలలో ఫ్యామిలీతో కలిసి చివరిసారిగా దిగిన ఫొటోను పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది అలేఖ్య.

tarakaratna's daughter wrote emotional note to her mother..

తాజాగా తారకరత్న కూతురు నిషిక రాసిన నోట్‌ ని సోషల్ మీడియా లో షేర్ చేసింది అలేఖ్య. ఆ నోట్ అందరినీ కదిలిస్తోంది. ‘అమ్మా నువ్వు చాలా ఆవేదనలో ఉన్నావు. నువ్వు ఇంకోసారి ఏడిస్తే.. నేను నీకు గుడ్‌బై చెబుతాను’ అని ఆ నోట్ లో రాసింది నిషిక. ఈ లేఖ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తల్లీకూతుళ్ల మధ్య అనుబంధానికి ప్రతీకగా ఈ నోట్‌ నిలుస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

tarakaratna's daughter wrote emotional note to her mother..

తారకరత్న ఆకస్మిక మరణం తో ఆయన భార్య అలేఖ్య ఎంతో బాధ పడుతున్నారు. తమ వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ.. భావోద్వేగానికి లోనవుతోంది అలేఖ్య. వాటిని చూసిన వారికి.. తారకరత్న-అలేఖ్యారెడ్డి మధ్య ఎంత బలైమన బంధం ఉందో.. ఆయన తన భార్యను ఎంతలా ప్రేమించారో అర్థం అవుతుంది. ఆమె పోస్ట్ లు చూసిన తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. అలేఖ్యారెడ్డి త్వరగా ఈ బాధ నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు.


End of Article

You may also like