“7/జి బృందావన్ కాలనీ” తెలుగు, తమిళ సీన్స్ లో… ఈ తేడా గమనించారా..?

“7/జి బృందావన్ కాలనీ” తెలుగు, తమిళ సీన్స్ లో… ఈ తేడా గమనించారా..?

by kavitha

Ads

తెలుగు బ్లాక్ బస్టర్ సినిమాలలో ‘7/జి బృందావన్ కాలనీ’ మూవీ ఒకటి. 2004లో రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ మూవీకి యూత్ మొత్తం కనెక్ట్ అయ్యారు. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీకి కలెక్షన్ల వర్షం కురిపించింది.

Video Advertisement

కోలీవుడ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించారు. ఈ మూవీని తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కించారు. అయితే ఈ మూవీలోనీ ఒక సీన్ ని తెలుగు, తమిళంలో ఏ వర్షెన్ నచ్చిందని సోషల్ మీడియాలో అడిగారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రొడ్యూసర్ ఎంఎం రత్నం కుమారుడు రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ 7/జి బృందావన్ కాలనీ. ఈ సినిమాని ప్రముఖ ప్రొడ్యూసర్ ఎంఎం రత్నం నిర్మించారు. ఈ మూవీని తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ చేశారు. రెండు చోట్ల ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.
ఈ సినిమాకి సంగీతం ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా అందించారు. ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పటికీ ప్రేక్షకులను ఫిదా చేస్తాయి. ఇటీవలే ఈ మూవీ రీరిలీజ్ అయ్యింది. రీరిలీజ్ లో కూడా ఈ మూవీకి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే తాజాగా ఈ మూవీలో ఒక సీన్ కు సంబంధించిన తెలుగు మరియు తమిళం వీడియోలను ఒక యూజర్ ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ, వీటిలో ఏ వర్షెన్ నచ్చింది అంటూ అడిగారు. తమిళ్ సీన్ లో తండ్రి హీరోతో ఎమోషనల్ గా చెప్తాడు. అయితే తెలుగు సీన్ లో తండ్రి ఫ్రస్టేషన్ తో చెప్తాడు. ఈ రెండింటిలో తెలుగులోనే తండ్రిగా సహజంగా నటించారని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. తండ్రి పాత్రలో చంద్ర మోహన్ చాలా సహజంగా చేశారని కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/reel/CxnVEpup0bE/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D

Also Read: హీరోయిన్ “కుష్బూ” కి ఈ గుడి వాళ్ళు పూజ ఎందుకు చేసారు..? అసలు విషయం ఏంటంటే..?


End of Article

You may also like