ఎట్టకేలకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలయ్యింది. సాధారణంగా అయితే ఈ ప్రోగ్రాంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలని మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులను కూడా తీసుకున్నారు.

shannu 1

యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన షణ్ముఖ్ జస్వంత్ కూడా ఈ సారి బిగ్ బాస్ షో లో పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే. షణ్ముఖ్ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారని.. ముందు నుంచే ప్రచారం జరుగుతూ వచ్చింది. సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్ లతో మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న షణ్ముఖ్ బిగ్ బాస్ లో కి రావడానికి భారీ గానే రెమ్యునరేషన్ అడిగారట.

shannu 2

షన్ను అడిగిన రెమ్యునరేషన్ స్టార్ హీరో రేంజ్ లో ఉండడం తో బిగ్ బాస్ నిర్వాహకులు షణ్ముఖ్ ని రిజెక్ట్ చేశారు అని కూడా వార్తలు వచ్చాయి. అయితే.. తొలి రోజు బిగ్ బాస్ హౌస్ గ్రాండ్ గా ఓపెన్ అయింది. అయితే.. తొలి రోజు షన్ను కూడా ఎంట్రీ ఇవ్వడం తో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఐతే.. షణ్ముఖ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు అన్న సంగతి మాత్రం ఎవరికీ తెలియలేదు.

shannu 3

ఈ క్రమం లో షణ్ముఖ్ రెమ్యునరేషన్ కు సంబంధించిన వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ వార్తల ప్రకారం షణ్ముఖ్ బిగ్ బాస్ లోకి రావడానికి కోటి రూపాయల రెమ్యునరేషన్ ను డిమాండ్ చేశారట. అయితే.. తొలుత బిగ్ బాస్ నిర్వాహకులు తటపటాయించినప్పటికీ.. అంత రెమ్యునరేషన్ ను ఇవ్వడానికి ముందుకొచ్చారని తెలుస్తోంది. షణ్ముఖ్ తన యూట్యూబ్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో నెలకు దాదాపు ఏడెనిమిది లక్షల వరకు సంపాదిస్తారనే టాక్ ఉంది. అందుకే ఆయనకు అంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి బిగ్ బాస్ యాజమాన్యం కూడా ముందుకొచ్చిందని తెలుస్తోంది.