Ads
మన డైరెక్టర్లు ఎన్నో ఇంటర్వ్యూ ల్లో కనిపిస్తూనే ఉంటారు. కానీ ఏ ఇంటర్వ్యూ లో అయినా వాళ్ళు ఎక్కువగా మాట్లాడేది కేవలం సినిమా గురించి మాత్రమే. దర్శకుడి దృష్టితోనే సినిమా చిత్రీకరిస్తారు కాబట్టి ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు కూడా అసలు ఆ దర్శకుడు తను తీసిన సినిమా గురించి ఏమనుకుంటున్నారో, రాబోయే ప్రాజెక్ట్స్ ఏంటి, ఇలాంటి విషయాలు మాత్రమే అడుగుతారు.
Video Advertisement
ఎక్కడో చాలా అరుదుగా వాళ్ల వ్యక్తిగత వివరాల గురించి మాట్లాడుతారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది దర్శకుల భార్యలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 పూరి జగన్నాథ్ – లావణ్య
దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. పూరి జగన్నాథ్ భార్య లావణ్య అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో కనిపిస్తూ ఉంటారు.
#2 త్రివిక్రమ్ శ్రీనివాస్ – సౌజన్య
త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య పేరు సౌజన్య. సౌజన్య మంచి క్లాసికల్ డాన్సర్ కూడా. ఇటీవల క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంతే కాకుండా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి బంధువు కూడా అవుతారు.
#3 రాజమౌళి – రమా రాజమౌళి
రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ప్రతి సినిమాకి రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తూ ఉన్నారు. బాహుబలి సినిమాకి రామా రాజమౌళి రూపొందించిన కాస్ట్యూమ్స్ కి చాలా మంచి గుర్తింపు లభించింది.
#4 వక్కంతం వంశీ – శ్రీ విద్య
ఆట వంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఫేమస్ అయిన శ్రీ విద్య, వక్కంతం వంశీ భార్య. శ్రీ విద్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.
#5 అనిల్ రావిపూడి – భార్గవి
అనిల్ రావిపూడి భార్య పేరు భార్గవి. ఈమె ఎక్కువగా బయటికి రారు.
#6 బోయపాటి శీను – విలేఖ
బోయపాటి శ్రీను భార్య పేరు విలేఖ. ఈమె కూడా బయట ఎక్కడా పెద్దగా కనిపించరు.
#7 సుకుమార్ – తబిత
సుకుమార్ భార్య తబిత కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.
#7 వంశీ పైడిపల్లి – మాలిని
వంశీ పైడిపల్లి భార్య మాలిని పైడిపల్లి కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.
#8 సుజిత్ – ప్రవల్లిక
సుజిత్ తన చిన్ననాటి స్నేహితురాలు అయిన ప్రవల్లికని పెళ్లి చేసుకున్నారు. చాలా సింపుల్ గా వీరి పెళ్లి జరిగింది.
#9 సురేందర్ రెడ్డి – దీప
సురేందర్ రెడ్డి భార్య పేరు దీపా రెడ్డి. వ్యాపార రంగంలో ఉన్నారు.
#10 ప్రశాంత్ వర్మ-సుకన్య రాజు
ప్రశాంత్ వర్మ భార్య సుకన్య రాజు డిజైనర్. సచ్ బై సుకన్య రాజు చేకూరి పేరుతో తన సొంత బ్రాండ్ నడుపుతున్నారు.
#11 శ్రీను వైట్ల – రూప
శ్రీను వైట్ల భార్య రూప వైట్ల ఫ్యాషన్ డిజైనర్. అంతకుముందు కొన్ని శ్రీను వైట్ల సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్ గా చేశారు.
అలా మన డైరెక్టర్ల భార్యలు కూడా వివిధ రంగాల్లో రాణిస్తున్నారు.
End of Article