నెక్స్ట్ సినిమాతో కచ్చితంగా “హిట్” కొట్టాల్సిన 13 తెలుగు డైరెక్టర్స్..! లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే.?

నెక్స్ట్ సినిమాతో కచ్చితంగా “హిట్” కొట్టాల్సిన 13 తెలుగు డైరెక్టర్స్..! లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే.?

by Anudeep

Ads

ఒక సినిమాకు నటీ నటులు, ప్రొడ్యూసర్ ఎంత ముఖ్యమైనప్పటికీ డైరెక్టర్ లేనిదే పని జరగదు. డైరెక్టర్ తన దృష్టి తో సినిమా చూసాకే కెమెరా ద్వారా ఆ సీన్లు వెండితెరకు పరిచయం అవుతాయి. కొన్ని సినిమాలు డైరెక్టర్ ఎంత కాన్ఫిడెన్స్ తో తీసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడతాయి.

Video Advertisement

దీంతో అవకాశాలు తగ్గడమో, ఇంకో సినిమా కోసం కొంతకాలం ఎదురు చూసి పక్కా హిట్ అవసరం అయ్యే పరిస్థితికి చేరుకుంటారు. అలా ఇప్పుడు టాలీవుడ్ లో పక్కా హిట్ కొట్టాల్సిన డైరెక్టర్లు ఎవరో చూద్దాం..

#1. వి వి వినాయక్:


ఒకప్పుడు టాప్ డైరెక్టర్ గా ఉన్న వి వి వినాయక్ వరుస ఫ్లాప్ లతో హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. 2018 లో వచ్చిన ఇంటిల్లిజెంట్ అంతగా ఆకట్టుకోలేదు.

#2. కృష్ణవంశీ:


అప్పట్లో కల్ట్, క్లాసిక్ సినిమాలకు పెట్టింది పేరు కృష్ణ వంశీ. సింధూరం, గులాబీ, అంతఃపురం వంటి అద్భుత సినిమాలు తీసిన కృష్ణవంశీ నక్షత్రం, గోవిందుడు అందరివాడేలే వంటి ఫ్లాప్ లతో ఉన్న కృష్ణవంశీ రంగమార్తాండతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

#3. పూరీ జగన్నాథ్:


డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ పైసా వసూల్, మహబూబా వంటి ఫ్లాప్ ల తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్నప్పటికీ అది ఆయన రేంజ్ హిట్ మాత్రం కాదు. లైగర్ తో బ్లాక్ బస్టర్ పై కన్నేశాడు పూరీ.

#4. చంద్రశేఖర్ యేలేటి:

ఐతే, అనుకోకుండా ఒకరోజు వంటి వైవిధ్యమైన చిత్రాలు తీసే చంద్రశేఖర్ యేలేటి. ఆ మధ్య వచ్చిన చెక్ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో వచ్చే సినిమాతో తప్పక హిట్ కొట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

#5. మెహర్ రమేష్:

కంత్రి, షాడో, బిల్లా వంటి ఫ్లాప్ లతో ఉన్న మెహర్ రమేష్ తెలుగులో ఇప్పటి వరకు హిట్ సినిమా తీయలేదు. ప్రస్తుతం చిరంజీవితో తీస్తున్న భోళా శంకర్ తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు మెహర్ రమేష్.

#6. కొరటాల శివ:

కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న కొరటాల శివకు ఆచార్యతో గట్టి దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. దీంతో ఎన్టీఆర్ 30తో కొరటాల మరో హిట్ తో సత్తా చాటాల్సి ఉంది.

#7. శ్రీకాంత్ అడ్డాల:


కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు చెట్టు వంటి సినిమాలతో ఆకట్టుకున్న శ్రీకాంత్ అడ్డాల ఆ తర్వాత ముకుంద, బ్రహ్మోత్సవం వంటి వరుస ఫ్లాప్ లు తీసాడు. వెంకటేష్ తో నరప్ప తీసినప్పటికీ అది రీమేక్ పైగా ఓటీటీలో విడుదలైంది. తీయబోయే చిత్రం శ్రీకాంత్ అడ్డాల కీలకం.

#8. సురేందర్ రెడ్డి:


రేసు గుర్రం హిట్ తర్వాత ధ్రువ వచ్చినప్పటకీ అది రీమేక్ సినిమా. ఆ మధ్య వచ్చిన సైరా ఫ్లాప్ అవ్వడంతో అఖిల్ ఏజెంట్ తో హిట్ పై కన్నేశాడు సురేందర్.

#9. ఇంద్రఘంటి మోహన కృష్ణ:


సుధీర్ బాబు తో చేసిన ‘సమ్మోహనం’ ఒక మాదిరిగా ఆడినప్పటికీ ఆ తరువాత నానిని నెగటివ్ రోల్ లో చూపిస్తూ సుధీర్ బాబు తో చేసిన ‘వి’ అటు ఓటీటీ లోనూ ఇటు థియేటర్ లో కూడా దారుణమైన ప్లాప్ గా పేరు తెచ్చుకుంది. మళ్లీ ఇప్పడు సుధీర్ బాబుతో చేస్తున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా మీదే ఇంద్రగంటి ఆశలన్నీ పెట్టుకున్నాడు.

#10. గుణశేఖర్:


నిప్పు డిజాస్టర్ తర్వాత అనుష్కను పెట్టి అల్లు అర్జున్ తో ఒక ప్రత్యేక పాత్ర చేయించిన రుద్రమదేవి మంచి పేరు తీసుకొచ్చినప్పటికీ హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. మళ్లీ చాలా రోజుల తర్వాత సమంత హీరోయిన్ గా శాకుంతలం సినిమా తీస్తున్నాడు గుణశేఖర్. మరి ఈ సినిమాతో అయినా హిట్టు కొడతాడేమో చూడాలి.

#11. మారుతీ:


ప్రతి రోజు పండగేతో హిట్ కొట్టిన తర్వాత మళ్లీ మంచి రోజులు వచ్చాయి, పక్కా కర్షియల్ సినిమాలు ఆశించిన కలెక్షన్లు రాలేదు. దీంతో నెక్స్ట్ మూవీతో హిట్ కొట్టాల్సి ఉంది.

#12. శ్రీను వైట్ల:


ఆనందం, వెంకీ, దూకుడు వంటి సక్సెస్ లు సినిమాలు తీసిన శ్రీను వైట్ల బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ వంటి వరుస డిజాస్టర్ లు ఉన్నాయి. ఇప్పుడు డబల్ డోస్ అనే సినిమా మంచు విష్ణు తో చేస్తున్నాడు ఇకనైనా హిట్ కొడతాడేమో చూడాలి.

#13. రామ్ గోపాల్ వర్మ:


శివ, సత్యం, గాయం వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన ఆర్జీవీ ఈ మధ్య హిట్ సినిమాలు ఏం తీయలేదు. అన్నీ వరుస డిజాస్టర్ సినిమాలే. ఆర్జీవీ మార్క్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు.


End of Article

You may also like