తెలుగు హీరో హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పే ఈ 16 మంది డబ్బింగ్ ఆర్టిస్ట్స్ గురించి మీకు తెలుసా?

తెలుగు హీరో హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పే ఈ 16 మంది డబ్బింగ్ ఆర్టిస్ట్స్ గురించి మీకు తెలుసా?

by Anudeep

Ads

తెలుగు సినిమాల్లో హీరోలు మినహా హీరోయిన్లు, విలన్లు ఎక్కువగా పరభాషా నటులే . దాంతో నటన అంటే వారు నటిస్తారు కాని మరి డైలాగుల సంగతేంటి. వారిని నటనకు తగ్గట్టుగా డైలాగులు చెప్పే డబ్బింగ్ ఆర్టిస్టులు ఎవరబ్బా? ఏం మాయ చేసావే లో జెస్సీ వాయిస్ కి ఎందరో పడిపోయారు. ఎవరా ఆ డబ్బింగ్ ఆర్టిస్టని సెర్చ్ చేసి చిన్మయి అని కనిపెట్టారు. దీంతో సమంతా తో పాటుగా ఆ వాయిస్ తో చిన్మయి కూడా అంతే స్థాయిలో ఫ్యాన్స్ ని సాధించుకుంది.

Video Advertisement

బొమ్మరిల్లులో హ హ హాసిని అని జెనిలియా మాట్లాడే ముద్దు ముద్దు మాటల వెనుక ఉన్నది ఎవరు? నిన్ను వదల బొమ్మాలి, నిన్నొదల అంటూ భయపెట్టిన ఆ గొంతు ఎవరిది ? రాజశేఖర్ స్టేజ్ పై ఏంటి అలా మాట్లాడతాడు, సినిమాల్లో డైలాగులు మాత్రం చాలా గంభీరంగా ఉంటాయి. ఆ గంభీరమైన వాయిస్ ఎవరిది? వీళ్లే కాదు మరొకందరి డబ్బింగ్ ఆర్టిస్టుల పరిచయం మీకోసం.

#1. సింగర్ మనో

గాయకుడిగా పరిచయం ఉన్న మనో మాంచి డబ్బింగ్ ఆర్టిస్టని ఎంతమందికి తెలుసు. మనో డబ్బింగ్ చెప్పేది ఆషామాషి నటులకు కాదు. సౌత్ సూపర్ స్టార్ రజిని కాంత్ , కమల్ హాసన్ లకి గాత్రం అరువిచ్చేది మనో నే. రజిని కాంత్ ప్రతి తెలుగు సినిమాకి డబ్బింగ్ ఆర్టిస్ట్ మనో. రజిని మార్క్ నటనకు ఆ పంచ్ లూ, డైలాగులని ఒడిసి పట్టడంలో మనో దిట్ట. కమల్ హాసన్ కొన్ని చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు.

#2. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

అన్నమయ్య చిత్రానికి గాను బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్టుగా నంది అవార్డందుకున్నారు ఎస్పీ బాలు గారు. అంతేకాదు దశావతారం సినిమాలో కమల్ హాసన్ పోషించిన పది పాత్రల్లో ఏడింటికి  డబ్బింగ్ చెప్పింది బాలు గారే. కమల్ హాసన్ ప్రతి చిత్రంలో వచ్చే కమల్ వాయిస్ బాలూ గారిదే.

#3. సాయి కుమార్

నటుడిగా అందరికి సుపరిచితుడైన సాయికుమార్ ది గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్ట్. సాయి కుమార్ డైలాగ్ డెలివరీ, స్పష్టత, ఆ వాయిస్ లో బేస్ ఇవన్ని లక్షణాలు సాయికుమార్ వాయిస్ కి అపార ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. రాజశేఖర్ మరియు సుమన్ లకి డబ్బింగ్ చెప్పేది సాయికుమారే. అంతేకాదు ది లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కి కూడా డబ్బింగ్ చెప్పారు సాయి కుమార్.

#4. ఎస్పీ శైలజ

బాలసుబ్రహ్మణ్యం చెల్లెలిగానే కాదు సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు ఎస్పీ శైలజ . నిన్నే పెళ్లాడతా లో టబుకి, మురారిలో సోనాలికి డబ్బింగ్ చెప్పింది శైలజ . సంఘవి, శ్రీదేవి ఇలా ఎందరో నటీమణులకు గాత్రదానం చేసింది. దక్షిణ చిత్రసీమలోనే ది బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నిలిచింది ఎస్పి శైలజ.

#5. హేమచంద్ర

సింగర్ గా పరిచయం ఉన్న హేమచంద్ర డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అని చాలా కొద్ది మందికి తెలుసు. ఇటీవల సింగింగ్ తో నటులకి డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశాడు. ధృవ సినిమాలో స్టైలిష్ విలన్ అరవింద్ స్వామికి డబ్బింగ్ చెప్పింది హేమచంద్రనే. అప్ కమింగ్ హీరోస్ కి వాయిస్ అరువివ్వడమే కాదు, సవ్యసాచి సినిమాలో మాధవన్ కి, ఆర్య, విజయ్,రాహుల్ లకి డబ్బింగ్ చెప్పాడు హేమచంద్ర.

#6. సవిత రెడ్డి

త్రిష, జెనిలియా, ఆర్తి , భూమిక ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ల కాలంలో వచ్చిన చాలా మంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ సవితనే . బొమ్మరిల్లు లో హాసిని, ఖుషిలో మధు  రెండు పాత్రలకి సవిత చెప్పిన డబ్బింగ్ తో ఎక్కడ లేని క్రేజ్ సంపాదించింది.

#7. రవిశంకర్

ప్రముఖ నటుడు సాయికుమార్ బ్రదర్ రవిశంకర్. అన్నదమ్ములిద్దరూ నటనతో పాటు డబ్బింగ్ ఆర్టిస్టులుగా కూడా తమ సత్తా చాటారు. ఇప్పటికి 4000కి పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పిన రవిశంకర్ వందల సంఖ్యలో అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. నాజర్, ప్రకాశ్ రాజ్, సోనూ సూద్ ఇలా ఎందరో నటులకి డబ్బింగ్ చెప్పారు. ఒకే సినిమాలో 2,3 పాత్రలకి డబ్బింగ్ చెప్పిన ఘనతను కూడా సాధించారు రవిశంకర్. అరుంధతి సినిమాలో పశుపతి పాత్రకి రవిశంకర్ చెప్పిన డబ్బింగ్ రవిశంకర్ కి చాలా పేరు తీసుకొచ్చింది.

#8. చిన్మయి శ్రీపాద

తన పాటలతోనే కాదు, మాటలతో కూడా మాయ చేసింది చిన్మయి. సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న చిన్మయి ,డబ్బింగ్ ఆర్టిస్టుగానూ అంతే స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. సమంత నటించిన సినిమాల్లో చాలా ఎక్కువ వాటికి డబ్బింగ్ చెప్పింది చిన్మయే. కేవలం తెలుగు మాత్రమే కాదు కన్నడ, తమిళ సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేస్తుంది చిన్మయి శ్రీపాద.

#9.సునీత

జయం, ఆనంద్ , పోతే పోని చిత్రాల్లో డబ్బింగ్ కి గానూ ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా అవార్డులని సొంతం చేసుకుంది సింగర్ సునీత. తన పాటలతో అందరిని మైమరిపించే సునీత మాటలతో కూడా మనసు దోచుకుంది. త్రిష, కమలిని ముఖర్జీ, సదా, మీరాజాస్మిన్ ఇలా ఎందరో హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పింది.

#10. రఘుకుంచె

ఒకప్పడు నటుడిగా సీరియల్స్ లో నటించిన రఘుకుంచె తరువాత సింగింగ్,మ్యూజిక్ డైరెక్టర్ అవతారం ఎత్తాడు. ఇటీవల పలాస1978 లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్నాడు. అబ్బాస్, దీపక్, అరవింద్ స్వామి, వినీత్ ఇలా మరెంతో మంది నటులకి డబ్బింగ్ చెప్పిన రఘుకుంచె, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డుని కైవసం చేసుకున్నరు.

#11. సరిత

మరో చరిత్ర సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సరిత ఎన్నో సినిమాల్లో నటించడంతో పాటు, సుజాత, మాధవి సుహాసిని, సుధా చంద్రన్, భానుప్రియ, విజయశాంతి, రాధ, శరణ్య, సౌందర్య, రోజా, ఆమని, టబు, నదియా, సుష్మితా సేన్, ఖుష్బూ ఇలా ఎంతో మందికి డబ్బింగ్ చెప్పారు.

#12. రోజా రమణి

రోజా రమణి ఎన్నో సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా సుహాసిని, రాధా, అర్చన, రాధిక, రజిని, శోభన, భానుప్రియ, గౌతమి, దివ్యభారతి, రోజా ఇంకా ఎంతో మందికి డబ్బింగ్ కూడా చెప్పారు.

#13. శిల్ప

శిల్ప ఎంతోమంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పారు. అరుంధతి, పంచాక్షరి సినిమాల్లో అనుష్క పాత్రకి, ఇటీవల వచ్చిన మిస్ ఇండియా సినిమాలో నదియా పాత్రకి, ఇంకా ఎంతో మందికి చెప్పారు శిల్ప. శిల్ప డబ్బింగ్ చెప్పడంతో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించారు.

#14. కలర్స్ స్వాతి

జల్సా సినిమాలో ఇలియానా పాత్రకి డబ్బింగ్ చెప్పారు కలర్స్ స్వాతి. సినిమా చూస్తున్నంత సేపు ఇలియానానే మాట్లాడుతున్నారు ఏమో అనిపిస్తుంది. స్వాతి గొంతు ఇలియానాకి అంత బాగా సూట్ అయ్యింది.

#15. హరిత

హరిత నచ్చావులే సినిమాలో మాధవి లతకి, రేసుగుర్రం, శ్రీమంతుడు, బలుపు, కాటమరాయుడు సినిమాల్లో శృతిహాసన్ కి, జులాయి, కిక్ సినిమాల్లో ఇలియానాకి, బెంగాల్ టైగర్, రెబల్, ఆగడు, అభినేత్రి సినిమాల్లో తమన్నాకి, ఇంకా ఎంతో మందికి వాయిస్ డబ్ చేశారు.

#16. రోహిణి

రోహిణి కూడా ఎంతోమంది నటులకి తెలుగు, తమిళ్ భాషల్లో డబ్బింగ్ చెప్పారు. గీతాంజలి సినిమాలో గిరిజ పాత్రకి, గాయం సినిమాలో రేవతి పాత్రకి, అంతం సినిమాలో ఊర్మిళ పాత్రకి, అర్జున్ సినిమాలో కీర్తి రెడ్డి పాత్రకి, ఇంకా ఎంతో మందికి డబ్బింగ్ చెప్పారు రోహిణి.

 


End of Article

You may also like