సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో స్టార్స్ చిన్నప్పటి ఫోటోలు వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే. అయితే వీటిలో ఎక్కువగా హీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోలు విపరీతంగా వైరల్ గా మారుతూ ఉంటాయి. అయితే తాజాగా ఒక యంగ్ హీరో చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Video Advertisement

అయితే ఈ ఫోటోలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నారు. మహేష్ పక్కన ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబు ఇప్పుడు టాలీవుడ్ లో యంగ్ హీరోగా రాణిస్తున్నాడు. ఆ హీరో నటించింది తక్కువ చిత్రాలు అయినప్పటికి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి ఆ బాబు ఎవరో ఇప్పుడు చూద్దాం..
young-hero-with-mahesh-babu-old-picఈ ఫొటోలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు ఉన్న బాబు ఎవరంటే హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్. శ్రీకాంత్ వారసుడిగా రోషన్ తెలుగు ఇండస్ట్రీలో నిర్మల కాన్వెంట్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొంచెం విరామం తీసుకుని దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో పెళ్లిసందడి చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాను మహిళా దర్శకురాలు గౌరీ రోనంకీ తెరకెక్కించారు. ఈ చిత్రంలో రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక ఈ మూవీతో రోషన్ మరింత గుర్తింపును సంపాదించుకున్నాడు.
roshan-meka1రోషన్ కి ప్రస్తుతం వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రోషన్ వైజయంతి బ్యానర్ లో ఒక  చిత్రాన్ని అంగీకరించినట్లుగా సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభించారని తెలుస్తోంది. రోషన్ ఈ చిత్రంతో పాటుగా సితార బ్యానర్ లోనూ ఒక మూవీని చేయడానికి ఒప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. roshan-mekaఇక ఇప్పుడు రోషన్ మహేష్ బాబుతో ఉన్న ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.అయితే ఈ ఫోటో పై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు పక్కన ఉన్న బాబు ప్రస్తుతం చాలా మారిపోయాడు. అయితే సూపర్ స్టార్ మహేష్ మాత్రం కొంచెం కూడా మారలేదు. అప్పటిలాగే అందంగా ఉన్నారని కామెంట్స్ పెడుతున్నారు.
roshan-meka-pellisandadiAlso Read: రజనీకాంత్ మూవీ వల్ల నా కెరీర్ ముగిసిపోయింది.. వైరల్ అవుతున్న మనీషా కోయిరాల కామెంట్స్