అంబానీ ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్ కార్డ్ మీద రాసిన ఈ 2 పదాల అర్థం ఏంటి..? అది ఏ భాష అంటే..?

అంబానీ ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్ కార్డ్ మీద రాసిన ఈ 2 పదాల అర్థం ఏంటి..? అది ఏ భాష అంటే..?

by Mohana Priya

Ads

కొంత కాలం క్రితం అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్ళికి సంబంధించిన వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలు ఎంత ఘనంగా జరిపారు అంటే, ఇవి అయిపోయిన నెల రోజుల పాటు వీటి గురించి మాత్రమే మాట్లాడుకున్నారు. అంత ఘనంగా ఈ వేడుకలు నిర్వహించారు. అక్కడితో అయిపోలేదు. ఇప్పుడు మళ్లీ పెళ్లికి ముందు ఇంకొక ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈసారి యూరప్ లో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అది కూడా క్రూజ్ లో ఇది ప్లాన్ చేశారు. బాలీవుడ్ సినిమా తారలు అందరూ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు. ఈపాటికే చాలా మంది ఈవెంట్ కి యూరప్ కి బయలుదేరారు.

Video Advertisement

terra and mare meaning on ambani celebration invitation

మూడు రోజులపాటు ఈవెంట్ ఘనంగా సాగుతుంది. గత ఈవెంట్ లాగానే, ఈసారి కూడా ఎన్నో సెలబ్రేషన్స్ ఉంటున్నాయి. కానీ ఈసారి థీమ్ మాత్రం కొంచెం మార్చారు. ఇందుకు తగ్గట్టుగా భారీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సినిమా రంగానికి చెందిన ప్రముఖులు మాత్రమే కాకుండా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ ఈవెంట్ లో పాల్గొంటున్నారు. క్రూజ్ లో ఈవెంట్స్ నిర్వహించడం అనేది సినిమాల్లో మాత్రమే చూస్తున్నాం. కానీ నిజంగా అంబానీ వారు ఇలా ఈవెంట్ డిజైన్ చేయడం అనేది అందరికీ చాలా కొత్తగా అనిపిస్తోంది. ఈ ఈవెంట్ కోసం ఒక కార్డు కూడా డిజైన్ చేశారు.

అందులో టెర్రా అండ్ మేర్ అనే రెండు పదాలని వాడారు. ఆ పదాల అర్థం ఏంటో తెలుసుకోవడానికి అందరూ వెతకడం మొదలుపెట్టారు. దాని అర్థం భూమి, నీళ్లు అని వస్తుంది. ఇది ఈవెంట్ థీమ్ ని సూచిస్తుంది. నీళ్ల అంత లోతుగా, భూమి అంత అంతులేనిదిగా వారి ప్రేమ ఉండాలి అని ఇలాంటి పదాలు వాడారు. ఇవి ఇంగ్లీష్ పదాలు. కాకపోతే ఇవి 19వ శతాబ్దంలో ఈస్టర్న్ ప్రాంతాల్లో ఎక్కువగా వాడేవారు. ఎంతో అర్థవంతంగా ఉండేలాగా ఈ పదాలు ఎంచుకున్నారు. ఈసారి కూడా సెలబ్రేషన్స్ అంతే ఘనంగా జరుగుతాయి. ముందు జరిగిన సెలబ్రేషన్స్ జాంనగర్ లో జరగగా, ఈసారి యూరోప్ లో చేస్తున్నారు. విలాసవంతమైన ఏర్పాట్లతో పాటు ఖరీదైన బహుమతులు కూడా అతిథులకి ఇస్తున్నారు.


End of Article

You may also like