కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌కు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం  లేదు. ఇక ట్విట్టర్‌లో ఫ్యాన్ వార్ అంటే అది విజయ్ ఫ్యాన్స్‌ అని చెప్పొచ్చు. విజయ్‌కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతగా ఉంటుంది.

Video Advertisement

అయితే అలాంటి స్టార్ కి ఇప్పటి దాకా సోషల్ మీడియా ఖాతా లేదు. ఇది ఆశ్చర్య పోవాల్సిన విషయమే. ఆయన ఫ్యాన్స్ ఎప్పటినుండో సోషల్ మీడియా అకౌంట్స్ తెరవమని వేడుకున్న ఆయన పెద్దగా పట్టించుకోలేదు. అయితే విజయ్ తాజాగా తన ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇస్తూ ఇన్ స్టాగ్రాంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన ఇన్ స్టాగ్రాం ఖాతా ఓపెన్ చేయడమే ఆలస్యం. ఫ్యాన్స్ లైకులు, కామెంట్లతో సునామీని క్రియేట్ చేశారు. ఎంతలా అంటే 99 నిమిషాల్లో  మిలియన్ ఫాలోవర్స్ తో సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు.thalapathy-vijay-instagram-followers-1విజయ్ తన ఖాతాలో తన ఫోటోను షేర్ చేయడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విజయ్ కి  ఫాలోయింగ్‌ ఎంతలా ఉందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పవచ్చు. ఆయన పోస్ట్ చేసిన గంటలోనే మిలియన్ల కొద్ది లైకులు, వేలలో కామెంట్లు వచ్చాయి. ఖాతా మొదలుపెట్టిన 99 నిమిషాల్లో మిలియన్  ఫాలోవర్స్ చేరిన మొదటి ఇండియన్‌గా విజయ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ప్రపంచవ‍్యాప్తంగా అయితే ఈ విషయంలో మూడోస్థానంలో ఉన్నారు. మొదటి రెండు స్థానాల్లో బీటీఎస్ వీ- 43 నిమిషాలు, ఎంజెలీనా జోలీ- 59 నిమిషాలు ఉన్నారు.
thalapathy-vijay-instagram-followers-3విజయ్‌ని కళ్యాణి ప్రియదర్శన్, హీరోయిన్ కీర్తి సురేష్‌ లాంటి హీరోయిన్లు అప్పుడే ఫాలో చేస్తున్నారు. ఈ విధంగా సెలెబ్రిటీలు కూడా విజయ్‌ని ఇంస్టాలో ఫాలో అవుతున్నారు. విజయ్ కి ప్రస్తుతం 4.3 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. అయితే విజయ్ ఇంతవరకు ఒక్కరిని ఫాలో అవ్వలేదు. విజయ్ ఇటీవల వారసుడు సినిమాతో ప్రేక్షకుల పలకరించాడు. విజయ్ చిత్రాలు ఎలా ఉన్నాప్పటికి  కోలీవుడ్ లో ఆడుతాయని వారసుడు నిరూపించింది. యావరేజ్ మూవీని సైతం ఆయన అభిమానులు బ్లాక్ బస్టర్‌గా మారుస్తుంటారు.
thalapathy-vijay-instagram-followersఅలా ఆయన చిత్రాలన్ని 100, 200 కోట్ల క్లబ్బులో అడుగుపెడుతూనే ఉన్నాయి. ఇక వారిసు, బీస్ట్ చిత్రాలు యావరేజ్ టాక్ వచ్చినప్పటికి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనకరాజ్‌దర్శకత్వంలో  లియో చిత్రాన్ని చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మరియు డిజిటల్ రైట్స్ గురించి కూడా ఎన్నో ప్రచారాలు వస్తున్నాయి.Also Read: ‘బలగం’ సినిమాకు అంతర్జాతీయ పురస్కారం.. ఇప్పటివరకు ఎన్ని అవార్డులు వచ్చాయంటే..