తమిళ స్టార్ దళపతి విజయ్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా వారసుడు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి తమిళంలో ‘వారిసు’ అనే టైటిల్ ఫిక్స్ చేయగా తెలుగులో వారసుడుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో రష్మిక మందన్న హీరోయిన్. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ నెట్టింట వైరల్ గా మారింది.

Video Advertisement

వారసుడు చిత్రానికి గాను దళపతి విజయ్ 109 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని సమాచారం. నిజానికి విజయ్ సినిమాలకు కోలీవుడ్‌లో మంచి గిరాకీ ఉంటుంది. విజయ్ సినిమాలకు టాక్ ఎలా ఉన్నా కూడా కోలీవుడ్‌లో మంచి వసూళ్లు వస్తాయి. అందుకే విజయ్‌కి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకు వస్తుంటారు. దీంతో విజయ్ రెమ్యూనరేషన్ పై చర్చలు జరుగుతున్నాయి.

halapathy vijay remunaration goes up..!!

ప్రస్తుతం దేశంలో ప్రభాస్‌కే ఎక్కువ మొత్తం రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఆదిపురుష్‌ సినిమాకు దాదాపు రూ. 120 కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మిగిలిన హీరోలు 70 కోట్ల వరకు తీసుకుంటున్నారు. విజయ్ తన గత సినిమా విజిల్ కోసం దాదాపుగా 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు అప్పట్లో టాక్ నడిచిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం విజయ్ రెమ్యూనరేషన్ వివరాలు అందర్నీ షాక్ కి గురి చేస్తున్నాయి.

halapathy vijay remunaration goes up..!!

పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న వారసుడు సినిమా టోటల్ బడ్జెట్ సుమారు 250 కోట్ల రూపాయలని తెలుస్తోంది. దీంట్లో సగం బడ్జెట్ హీరో రెమ్యూనరేషన్ కి వెళ్ళింది అని కోలీవుడ్ మీడియా లో వైరల్ అవుతోంది. అయితే ఈ సినిమా నాన్ థియేట్రికల్, వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ కలుపుకుని మొత్తంగా 300 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ నడిచిందని తెలుస్తోంది. దీంతో సినిమా విడుదలకు ముందే నిర్మాత గట్టెక్కినట్టేనని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.