తమ్ముడు సినిమాతో తలుక్కుని మెరిసిన ప్రీతీ ఝాంగియానీ గుర్తుందా….ఆమె మొన్న ఆగస్ట్ 18న తన 42వ పుట్టినరోజు జరుపుకుంది. ఆమె ఫొటోస్ ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. నేటి కుర్ర హీరోయిన్ లకు పోటీగా ఉన్న ప్రీతిని చూసి అందరూ షాక్ అయ్యారు.

Video Advertisement

ప్రీతీ ఝాంగియానీ నటుడు అబ్బాస్ సరసన ‘చుయ్ ముయి సి తుమ్’ అనే ప్రసిద్ధ మ్యూజిక్ వీడియోతో షోబిజ్‌లో తన కెరీర్‌ను ప్రారంభించింది. దాని తర్వాత ఆమెకు సినిమాల లో మంచి ఛాన్స్ లు వచ్చాయి. ఈ క్రమంలో ఆమె 1999 లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన “తమ్ముడు” లో నటించింది. ఇది ఆమెకు తెలుగు లో మొదటి చిత్రం. అంతే కాకుండా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, పంజాబీ, బెంగాలీ, రాజస్థానీ, హిందీ వంటి ఎనిమిది భాషల్లో ప్రీతి సినిమాలు చేసింది.

audience funny response at thammudu movie theatres

తమ్ముడు చిత్రంలో ఆమె నటనతో ప్రీతి మంచి మార్కులు కొట్టేసింది. తరవాత కొంత కాలానికి ఆమె బాలకృష్ణ సరసన సూపర్ డూపర్ హిట్ మూవీ నరసింహనాయుడులో నటించింది. ఆ మూవీలో మంచి గ్లామరస్ రోల్ చేసినప్పటికీ తరువాత ప్రీతికి తెలుగు ఇండస్ట్రీలో అనుకున్నంత ఛాన్సులు దొరకలేదు. దీంతో ఆమె బాలీవుడ్ కే పరిమితమైంది. ఆ తరువాత చాలా రోజులకు 2007 లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ చిత్రంలో ఊర్వశి క్యారెక్టర్ లో కనిపించింది. యమదొంగ చిత్రంలో ఒక సాంగ్ లో కనిపించి తన స్టెప్పులతో కూర కారుకు క్రేజ్ పుట్టించింది.

ఇక ప్రీతీ ఝాంగియాని మొదట చిత్రనిర్మాత ఫిరోజ్ నడియాద్వాలా సోదరుడు ముస్తాక్ ఖాన్‌ ను నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే, కొన్ని పర్సనల్ సమస్యల కారణంగా ఈ జంట తమ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. తర్వాత 2008 లో, ప్రీతీ ఝాంగియాని నటుడు-దర్శకుడు పర్విన్ దబాస్‌ను వివాహం చేసుకున్నారు. వీళ్ళకి జైవీర్‌, దేవ్‌ ఇద్దరు మగ పిల్లలు.

పెళ్లి ,పిల్లల తర్వాత ప్రీతీ ఝాంగియానీ నటనకు విరామం తీసుకుంది. ఆమె ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “పర్విన్ నా పనికి ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటాడు. అతని మద్దతు లేకుండా, నేను ఏమి చేయలేను.అతను నాకు ఎప్పుడు ఎటువంటి హద్దులు విధించలేదు.మేము డేటింగ్ చేస్తున్నప్పుడు కూడా, మేమిద్దరం పనిచేస్తున్నాము, కానీ మా మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవు” అని చెప్పారు . ఆమె కెరీర్ పరంగా ఇప్పుడు సినిమా లలో చెయ్యక పోయిన…కొని యాడ్స్ మరియు ప్రాంతీయ చలనచిత్రాలలో ఆమె నటించారు.