Ads
ప్రపంచ దేశాలన్ని అగ్రదేశాలకు భయపడితే, అగ్రదేశాలని కూడా భయపెట్టగల సత్తా ఉన్నది ఆ దేశం.. కాదు కాదు ఆ దేశ అధ్యక్షుడు.. అతనే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్.. అతడి గురించి, అతడి నియంత పరిపాలన గురించి చదువుతుంటేనే మనకు వెన్నులో వణుకొస్తుంటుంది.
Video Advertisement
అలాంటిది ఆ దేశ ప్రజలు ఎంత బిక్కుబిక్కు మంటు బతుకుతూ ఉండుంటారో.. సరే వారి గురించి వదిలేద్దాం.. అతడు ఎలా బతుకుతాడో తెలుసా.. ఐ మీన్ అతడి లైఫ్ స్టైల్ తెలిస్తే ఔరా అని ముక్కున వేలేసుకుంటాం.. కిమ్ భార్య పేరు రీ సోల్ జు. నార్త్ కొరియా నియంత భార్య అయినా కూడా రీ సోల్ జు కొన్ని నియమాలను పాటించాల్సి వస్తుంది. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
# సాధారణంగా సెలబ్రిటీలు అంటే, వారి వ్యక్తిగత విషయాల గురించి వారు స్వయంగా చెప్పకపోయినా కూడా మీడియాకి తెలిసిపోతుంటాయి. కానీ రీ సోల్ జు విషయంలో మాత్రం ఆవిడకి సంబంధించిన వివరాలు ఏవీ ఇప్పటికి కూడా పెద్దగా తెలియవు. రిపోర్ట్ ప్రకారం రీ సోల్ జు అసలు పేరు అది కాదు. పెళ్లయిన తర్వాత పేరు మార్చుకున్నారు. అసలు పేరు ఏంటో ఎవరికీ తెలియదు.
# వివాహం జరగక ముందు రీ సోల్ జు, చైనాలో సింగింగ్ కి సంబంధించిన విద్యను అభ్యసించారు. నార్త్ కొరియాకు చెందిన ఉన్హాసు ఆర్కెస్ట్రా లో కూడా సభ్యురాలిగా ఉన్నారు. అలాగే సౌత్ కొరియాలో జరిగిన ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో నార్త్ కొరియా తరపున చీర్ లీడర్ గా ఉన్నారు.
# వార్తల ప్రకారం అయితే రీ సోల్ జు సెప్టెంబర్ 28, 1989 లో పుట్టారు. బిజినెస్ ఇన్సైడర్ కథనం ప్రకారం రీ సోల్ జు తండ్రి ఒక ప్రొఫెసర్ తల్లి డాక్టర్. అలాగే రీ సోల్ జు తండ్రి నార్త్ కొరియా ఎయిర్ ఫోర్స్ లో కూడాా ఉద్యోగం చేశారు అని అంటారు.
# రీ సోల్ జు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి, అనే విషయాలు కూడా ముందే నిర్ణయించబడతాయి.
# రీ సోల్ జు గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని నెలలపాటు బయట అస్సలు కనిపించరు. రీ సోల్ జు కిి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
#ఇంకొక విషయం ఏమిటంటే, సాధారణంగా భార్యాభర్తలు కలిసి ఉండే లేకపోతే విడాకులు తీసుకుంటారు. కానీ రీ సోల్ జు కి విడాకులు తీసుకునేే హక్కు లేదట. అంతే కాకుండా రీ సోల్ జు తన ఇష్టపూర్వకంగా కిమ్ ని పెళ్లి చేసుకోలేదు అని అంటారు.
End of Article