ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు జూనియర్ ఎన్టీఆర్. మొదటి నుంచి తాను ఎన్నుకున్న కథల్లో వైవిధ్యం ఉండేలా చూసుకుంటారు తారక్. అయితే ఒకానొక టైమ్ లో ప్లాప్ లతో సతమతమైన ఎన్టీఆర్ కి పూరిజగన్నాథ్ తో చేసిన ‘టెంపర్’ మూవీ మంచి బూస్ట్ ఇచ్చింది.

Video Advertisement

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో టెంపర్ సినిమా ఒకటి కాగా ఈ సినిమా క్లైమాక్స్ సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందనే సంగతి తెలిసిందే. కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ సాధించడానికి క్లైమాక్స్ కారణమని చాలామంది భావిస్తారు. అయితే ఈ సినిమాకి మొదట అనుకున్న క్లైమాక్స్ ఇది కాదని ఆ సినిమా రచయిత వక్కంతం వంశీకి తాజాగా ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించారు.

that is not the first climax for temper..

“మొదట క్లైమాక్స్ లో విలన్స్ జైలు కి వెళ్లకుండా బయటకి వచ్చాక వాళ్ళని హీరో చంపడంతో సినిమా ముగుస్తుంది. కానీ నాకు ఆ పాయింట్ నచ్చలేదు. దీంతో పూరి గారిని అడిగి.. గంట తర్వాత వేరే క్లైమాక్స్ ని చెప్పా. హీరో కూడా నిందితుల్లో ఒకడిగా మారడం అనే పాయింట్ చాలా మందికి కనెక్ట్ అయ్యింది. దీంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది.” అని వక్కంతం వంశీ వెల్లడించారు.