Ads
బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ యొక్క స్థాయి పెరిగింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు రాజమౌళి. ఈ మూవీ తో ప్రాంతీయ చిత్రాలకు సరిహద్దులు చెరిగిపోయాయి. ఆ చిత్రం తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.
Video Advertisement
అయితే బాహుబలి సినిమాలో ప్రభాస్ రానా అనుష్క పాత్రలు ఎంత హైలెట్ గా నిలిచాయో కట్టప్ప పాత్ర కూడా అంతే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ప్రభాస్ సత్యరాజ్ మధ్య సీన్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..? అంటూ ప్రపంచ దేశాలు కొన్నాళ్లు చర్చించుకున్నాయి. ఆ తర్వాత బాహుబలి పార్ట్ 2 వచ్చాక అసలు ట్విస్ట్ బయటపడింది.
రాజ్యానికి నమ్మిన బంటులా ఉంటూ ఆయన పాత్ర సినిమాను మార్చేస్తోంది. రెండో భాగం అంత హైప్ రావడానికి కట్టప్ప పాత్ర కీలకం. అయితే ఈ పాత్ర కోసం ముందుగా సత్యరాజ్ ని అనుకోలేదట. అయితే నిజానికి ఈ సినిమాలో కట్టప్ప రోల్ అనుకోగానే రాజమౌళి ముందు గా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ని అనుకున్నారట.
బాలీవుడ్ యాక్షన్ స్టార్ హీరో కమ్ విలన్ సంజయ్ దత్ ఈ మధ్య సౌత్ సినిమాల మీద ఆసక్తి చూపిస్తున్న ఆయన కె.జి.ఎఫ్ 2లో విలన్ గా అదరగొట్టారు. అయితే అంతకు ముందే తెలుగు సినిమా ఆఫర్ వచ్చినా తాను చేయలేదని అన్నారు సంజయ్ దత్. బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రకు రాజమౌళి తనని అడిగారని కానీ ఆ టైం లో డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరలేదని అన్నారు సంజయ్ దత్. కానీ కట్టప్పగా సంజయ్ దత్ చేసి ఉంటే సినిమా మరో రేంజ్ లో ఉండేది.
సంజయ్ దత్ కూడా కట్టప్ప పాత్ర మిస్ అయినందుకు తర్వాత ఫీల్ అయ్యానని ఆ పాత్ర రాజమౌళి చాలా గొప్పగా తెరకెక్కించారని అన్నారు . అయితే నటుడు సత్యరాజ్ కట్టప్ప పాత్రకు ప్రాణం పోశారని చెప్పాలి. ఈ పాత్ర తో సత్యరాజ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
End of Article