సెలబ్రిటీల ప్రతి మూమెంట్ పై అందరికి చాలా ఆసక్తి గా ఉంటుంది. ప్రతి విషయం వైరల్ అవుతూ ఉంటుంది. అందుకే వారు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే వారు పెళ్లి నుండి మ్యారేజ్ దగ్గరినుండి పిల్లల వరకు ప్రతీది ప్లాన్ చేసుకోక తప్పదు. హీరోయిన్ల అయితే కెరీర్‌కి ఇబ్బంది కాకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంటారు. అలాగే హీరో కి వివాహం అయితే వారి వారసుడు ఎప్పుడు వస్తాడా అని ఫాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు.

Video Advertisement

అయితే ఈ ఏడాది తల్లిదండ్రులు కాబోతున్న సెలెబ్రెటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం..

#1 రామ్ చరణ్ – ఉపాసన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కామినేని తాము పేరెంట్స్ అవబోతున్నామని డిసెంబర్‌లో ప్రకటించారు. వివాహమైన 10 ఏళ్ల తర్వాత వారు పిల్లల్ని కనాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మెగా ఫాన్స్ ఎంతో ఖుషి గా ఉన్నారు.

the celebreties who are going to be parents this year..!!

#2 పూర్ణ – షానిద్ అసిఫ్

గతేడాది జూన్ లో దుబాయ్ లో వ్యాపారవేత్తగా ఉన్న షానిద్ అసిఫ్ ని పెళ్లి చేసుకున్న పూర్ణ తాను తల్లి కాబోతున్నట్లు వెల్లడించారు. పెళ్లి అయినా ఆరు నెలలకే ఆమె తన ప్రెగ్నన్సీ ని ప్రకటించడం పై ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు.

the celebreties who are going to be parents this year..!!

#3 నేహా మర్దా – ఆయుష్మాన్ అగర్వాల్

‘బాలికా వధు’ సీరియల్‌తో పాపులర్ అయిన నేహా మర్దా 2023లో తాను మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదించబోతున్నానంటూ 2022 నవంబర్‌లో అనౌన్స్ చేశారు.

the celebreties who are going to be parents this year..!!

#4 అట్లీ కుమార్ – కృష్ణ ప్రియ

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ కుమార్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. తమిళనాట స్టార్ డైరెక్టర్ రేంజ్‌కి ఎదిగిన ఆయన ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2023లో తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ 2022 డిసెంబర్‌లో ఈ శుభవార్త చెప్పారు ప్రియ – అట్లీ.

the celebreties who are going to be parents this year..!!

#5 దీపికా కక్కర్

ససురల్ సిమర్ కాలో సిమర్ పాత్రలో నటించిన దీపికా కక్కర్ చాలా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత 2018 లో హిందీ బిగ్ బాస్ 12 లో పాల్గొన్న ఆమె విజేతగా నిలిచారు. పెళ్ళైన నాలుగేళ్ళ తర్వాత ఆమె తల్లి కాబోతున్నారు.

the celebreties who are going to be parents this year..!!

#6 గౌహర్ ఖాన్ – జైద్ దర్బార్

హిందీ బిగ్ బాస్ – 7 విన్నర్ గౌహర్ ఖాన్ తమ కుటుంబంలోనికి మరో వ్యక్తి రాబోతున్నారంటూ ఓ బ్యూటిఫుల్ యానిమేటెడ్ వీడియో షేర్ చేస్తూ ఈ శుభవార్తను ప్రేక్షకాభిమానులతో పంచుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో ఆమె తల్లి కాబోతున్నారని ప్రకటించారు.

the celebreties who are going to be parents this year..!!
#7 లాస్య – మంజునాథ్

తన యాంకరింగ్​తో అనేక మంది అభిమానులను సంపాదించుకున్న లాస్య కొంతకాలం యాంకరింగ్ కి దూరం గా ఉంది. అయితే బిగ్ బాస్ ద్వారా మరోసారి సందడి చేసిన యాంకర్ లాస్య ఇటీవల ప్రెగ్నెంట్ అని ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్ లో ఆమె తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు.

https://telugu.filmyfocus.com/celebs-who-will-embrace-parenthood-in-2023