బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాలో రవితేజ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కేథరిన్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. వైజాగ్ లోని ఏయూ గ్రౌండ్స్ లో వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది.

Video Advertisement

అయితే మరో వైపు శనివారం విడుదలైన ట్రైలర్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. చిరంజీవిని పక్కా మాస్ లుక్ తో చూడాలని కొంతకాలం నుంచి ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే ఈ చిత్రం లో చిరు ని అలాగే చూపించబోతున్నాడు అని ట్రైలర్ తో నిరూపించేసాడు దర్శకుడు బాబీ. అయితే ఫుల్ యాక్షన్ తో ఈ ట్రైలర్ ఆద్యంతం సాగింది.

the copied dialogue from waltair veerayya trailer..!!

అయితే ఈ ట్రైలర్ లో చిరు చెప్పిన డైలాగ్ ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ట్రైల‌ర్ లో చిరంజీవి… రికార్డుల్లో నా పేరు ఉండ‌టం కాదు…..నా పేరు మీద‌నే రికార్డ్స్ ఉంటాయి అంటూ డైలాగ్ చెప్పారు. అయితే ఇదే డైలాగును క‌మెడియ‌న్ పృధ్వీ….సాయి ధరమ్ తేజ హీరోగా వచ్చిన విన్న‌ర్ సినిమాలో చెప్పాడు. ఆ సినిమాకు గోపిచంద్ మలినేని డైరక్టర్. ప్రస్తుతం సంక్రాంతికి గోపీచంద్ మలినేని, బాబి సినిమాల మధ్యనే పోటీ నడుస్తోంది. ఈ నేపథ్యం లో ఈ డైలాగు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దాంతో బాబీ అన్నా ఈ పంచ్ డైలాగ్ ను అక్క‌డ లేపావా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆ వీడియోని కట్ చేసి వైరల్ చేస్తున్నారు.

the copied dialogue from waltair veerayya trailer..!!

‘వాల్తేరు వీరయ్య’.. సముద్రం నేపథ్యంలో .. జాలరి గూడెం బతుకుల చుట్టూ తిరిగే కథ. ఈ చిత్రం ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. సెన్సార్ వాళ్ల టాక్ బట్టి ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్‌గా చిరు అభిమానులు పండగ చేసుకునేలా ఉందనే టాక్ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతికి జనవరి 13 న ప్రేక్షకుల ముందుకి రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో వాల్తేరు వీరయ్య చిత్ర ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది టీం. ఇప్పటికే విడుదలైన పాటలు.. వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.