Ads
నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ ఘోస్ట్. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 5 న విడుదలై ఓకే అనిపించుకుంది.. మంచి బజ్‌తో వచ్చిన ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటించారు. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు.
Video Advertisement
ఈ సినిమాలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్, రవివర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్‌లతో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు.
విడుదలకు ముందు రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మూవీ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే చిరంజీవి గాఢ్ ఫాదర్ చిత్రం తో పోటీపడిన ఈ చిత్రం మార్నింగ్ షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇదిగా ఉంటే ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కు సంభందించిన ఒక అఫీషియల్ న్యూస్ బయటకు వచ్చింది.
నాగార్జున కంప్లీట్ యాక్షన్ మోడ్‌లో కనిపించిన ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుని స్ట్రీమింగ్ చేయనున్నారు. గతంలో నాగ్ నటించిన వైల్డ్ డాగ్ చిత్రం సైతం వారే కొనుగోలు చేస్తే ఓటీటీ లో బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ ఉత్సాహంతోనే మంచి పే చెక్ ఇచ్చి ఈ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
మరో వైపు సినిమా థియేటర్ లో విడుదలైన కొద్ది రోజులకే ఓటిటి కి వచ్చేయడంతో డిస్ట్రిబ్యూటర్లతో పాటు సినిమా ధియేటర్ల యాజమాన్యం చాలా నష్టాలు చూసే పరిస్థితి ఇటీవల నెలకొంది. భారీ బడ్జెట్ సినిమాలు కూడా.. తక్కువ టైంలోనే ఓటిటి లోకి వచ్చేస్తున్నాయి. సినిమా ఏమాత్రం ఫ్లాప్ అయితే రెండు వారాల లోపే ఓటిటి లోకి ప్రత్యక్షమవుతుంది. దీంతో డిస్ట్రిబ్యూటర్ లు చాలా నష్టపోతున్నారు.
ఈ పరిణామంతో ఇప్పుడు తెలుగు ఫిలిం చాంబర్.. సినిమా డిస్ట్రిబ్యూటర్ మరియు సినిమా ధియేటర్ ల యాజమాన్యాలు నష్టపోకుండా ఓటిటి విడుదల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు పది వారాల గ్యాప్ తర్వాత ఓటిటి లోకి విడుదల చేయాలని ..6 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ కలిగిన సినిమా నాలుగు వారాల గ్యాప్ తర్వాత ఓటిటి లోకి విడుదల చేసే అవకాశం కల్పిస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓటిటి విడుదలకు సంబంధించి కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది.
దీన్ని బట్టి ఒక ఎనిమిది వారాల తర్వాత ‘ది ఘోస్ట్’ ఓటీటీ లో ప్రేక్షకులను పలరించే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ ఛానెల్ జెమినీ టీవీ భారీ మొత్తానికి చేజిక్కించుకున్నట్లు తాజా సమాచారం.
End of Article