శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘గేమ్ ఛేంజర్’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. దిల్ రాజు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మూవీలో హీరోగా ముందుగా అనుకున్నది రామ్ చరణ్ ని కాదని, ఈ స్టోరీకి డైరెక్టర్ వేరే హీరోను అనుకున్నారట. కానీ దిల్ రాజు అతన్ని వద్దు అని రామ్ చరణ్ ను ఫైనల్ చేయించానని ఆయన ఓపెన్ గా మీడియాకు వెల్లడించారు.

Video Advertisement

ఈ చిత్రం ఎలక్షన్స్ నేపద్యంలో ఉంటుందని, ఎలక్షన్ ఆఫీసర్ చుట్టూ మూవీ కథ తిరుగుతుందని ఇప్పటికే ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తోంది. ఇక ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని శంకర్ రేంజ్ కు అనుగుణంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ 70 శాతానికి పైగా పూర్తయిందని దిల్ రాజు తెలిపారు.
ఇక డైరెక్టర్ శంకర్ ఊహించని విధంగా బడ్జెట్ ఖర్చు పెట్టిస్తుంటారని, కొన్ని సార్లు అయితే అనుకున్న బడ్జెట్ కన్నా  ఎక్కువ అవ్వొచ్చనే కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు దిల్ రాజు ముందు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టరని టాక్ ఉంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య కొన్నిసార్లు గొడవలు అయ్యాయనే రూమర్స్ వచ్చాయి. వీటిలో నిజం లేదని దిల్ రాజు చెప్పారు.డైరెక్టర్ శంకర్ గురించి నాకు తెలుసు. అందువల్ల ఆయన అభిరుచికి తగ్గట్టుగా ఈ మూవీ ఉండాలని ముందే అనుకున్నాము. ముందు ఇండియన్ 2 చేయాలని భావించాము. అయితే అది కుదరలేదు. తరువాత శంకర్ గారు గేమ్ చెంజర్ స్టోరి చెప్పినప్పుడు రామ్ చరణ్ హీరోగా అనుకోలేదు. ఆయన స్టోరీ చెప్పినపుడు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని అన్నారు. కానీ నేను రామ్ చరణ్ అయితే కరెక్ట్ గా ఉంటుందని సలహా ఇచ్చాను. దాంతో శంకర్ రామ్ చరణ్ కు కథ చెప్పడంతో ఇద్దరికీ కనెక్ట్ అయిందని అన్నారు.
Also Read: అందుకే మేకప్ వేసుకోనంటూ అసలు కారణం బయట పెట్టిన సాయి పల్లవి