పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినా.. అతితక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ స్టార్ట్ చేసి వరుసగా ఏడు సూపర్ హిట్లతో రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆయన స్టార్ డమ్ గురించి, క్రేజ్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.

Video Advertisement

 

ప్రస్తుతం పవన్ అటు రాజకీయాల్లో.. ఇటు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. పవన్ గురించి ఏ చిన్న వార్త వచ్చినా మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ సెన్సేషన్ అవుతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ బద్రి’ టైంలో ఇచ్చిన ఇంటర్వూ కి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది.

the novel which pavan kalyan wants to acted in..

పవన్ హీరోగా అనౌన్స్ చేసి, ఆగిపోయిన ఓ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఆ న్యూస్ లో ఉన్నాయి. పవన్, ప్రఖ్యాత నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కాంబినేషన్‌లో ‘డైరీ ఆఫ్ మిసెస్ శారద’ అనే చిత్రం చేయాలనుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘అభిలాష’, ‘ఛాలెంజ్’, ‘మరణమృదంగం’, ‘రాక్షసుడు’ లాంటి సూపర్ హిట్ సినిమాలు నవలా చిత్ర నాయకుడిగా ఆయనకు ఇమేజ్ తెచ్చి పెట్టాయి.

the novel which pavan kalyan wants to acted in..

ఆయన రాసిన అద్భుతమైన నవలలో ఒకటైన ‘డైరీ ఆఫ్ మిసెస్ శారద’ ఆధారంగా పవన్‌తో సినిమా చేయాలనుకొని అనౌన్సమెంట్ కూడా ఇచ్చేసారు. నవలలో కథానాయకుడు ‘బోస్’ పాత్రకే పవన్‌ని ఫిక్స్ చేశారు. తర నటీనటులు, స్క్రీన్‌ప్లే వర్క్ జరుగుతుండగానే మూవీని పక్కన పెట్టేశారు. అయితే కథగా డెవలప్ చేసే క్రమంలో.. ఈ నవల సినిమాగా సెట్ కాదు.. అందులోనూ పవన్ లాంటి స్టార్ ఇమేజ్‌కి అస్సలు సూట్ కాదని అర్థమై పక్కన పెట్టేశారు.