Ads
సాధారణంగా చాలా మంది నంబర్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళ వహనాలకి, ఇళ్ళకి ఉండే నంబర్లు ఇవే ఉండాలి అని కొంత మంది అనుకుంటారు. నంబర్లకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఆఫ్ఘనిస్థాన్ లో ఒక నంబర్ మాత్రం ఎక్కడా కనిపించకూడదు అనుకుంటారు. ఆఫ్ఘనిస్తాన్ లో 39 నంబర్ ఎక్కడా ఉండకుండా చూసుకుంటారు.
Video Advertisement
ఇంటి నెంబర్ లో కానీ, ఫోన్ నెంబర్ లో కానీ, వెహికల్ నంబర్ లో కానీ 39 డిజిట్స్ పక్క పక్కన ఉన్నట్టు కనిపిస్తే నంబర్ లో మార్పులు చేస్తారు. అందుకు కారణం ఏంటంటే. హెరాత్ లోని ఒక ప్రదేశంలో ఉండే వ్యభిచార వృత్తి నిర్వహించే ఒకతని కార్ నెంబర్, అపార్ట్మెంట్ నెంబర్ 39. అతను 39 నెంబర్ ద్వారా పిలవబడే వాడు.
అందుకే ఆ సంఖ్యని అక్కడి ప్రజలు అస్సలు ఇష్టపడరు. ఒకవేళ ఎవరికైనా వెహికల్ నెంబర్ లో 39 అనే నంబర్ ఉన్నప్పుడు ఆ నంబర్ మార్చడానికి 200 డాలర్ల నుండి 300 డాలర్ల వరకు తీసుకునే వారు అనే ఒక పుకారు కూడా ఉంది. ఒకవేళ ఆ నెంబర్ ఉన్న నంబర్ ప్లేట్ తో ఏదైనా వెహికల్ కనిపిస్తే ఆ వెహికల్ అతనికి (39) చెందిందే అని అనుకుంటారట.
అందుకే అక్కడి ప్రజలు అందరూ వారి వాహనాల నెంబర్ ప్లేట్ లపై 39 నెంబర్ రాకుండా చూసుకుంటారు ఒకవేళ వచ్చినా కూడా నంబర్ మార్పించడం, లేదా ఏదైనా షీట్ తో ఆ నెంబర్ కనిపించకుండా కవర్ చేయడం చేస్తూ ఉంటారు. ఒక్క వెహికల్ నెంబర్ మాత్రమే కాదు. ఫోన్ నెంబర్ లో కూడా 39 నెంబర్ ఉంటే వారికి చెందిన వారు అని అనుకుని ఫోన్ చేస్తారట. అలాంటప్పుడు కాలర్ ఐడీ హైడ్ చేయడం లేదా నెంబర్ మార్చుకోవడం చేస్తూ ఉంటారట.
End of Article