తెలుగులో పరభాషా నటీనటులు తళుక్కునమనడం కొత్తేమి కాదు. వివిధ రాష్ట్రాల నటీమణులు తెలుగులో ఇప్పటికే తమని తాము నిరూపించుకున్నారు. వారిలో ఎక్కువగా ముంబై వాళ్లే ఉండేవారు. ఇప్పుడు తమిళ, కన్నడ, మలయాళ భామలు కూడా తెలుగులో సత్తా చాటుతున్నారు. ఒక వైపు డబ్బింగ్ చిత్రాలు, మరోవైపు ఓటీటీల ప్రాభవం పెరుగుతున్న నేపథ్యం లో అన్ని భాషల సినిమాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉంటున్నాయి.

Video Advertisement

అలా ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

#1 సప్తమి గౌడ

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కన్నడ చిత్రం ‘కాంతార’. ఇందులో లీల పాత్రలో ఒదిగిపోయింది సప్తమిగౌడ. ఈ చిత్రం తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది సప్తమి.

the other language heroines who stole telugu audience heart..
#2 దర్శన రాజేంద్రన్

మలయాళ చిత్రం హృదయం లో ‘దర్శన..’ సాంగ్ ఈ ఇయర్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకి తెల్సిందే. ఇందులో దర్శన అందరికి క్రష్ అయిపోయింది. అలాగే వచ్చిన మరో చిత్రం ‘జయ జయ జయహే’ చిత్రం కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంది.

the other language heroines who stole telugu audience heart..

#3 కళ్యాణి ప్రియదర్శన్

హలో చిత్రం తో తెలుగు తెరకు పరిచయమైన కళ్యాణి ప్రియదర్శన్ కి తెలుగులో మంచి హిట్స్ లేవు కానీ.. మలయాళం లో మంచి మంచి చిత్రాల్లో నటించిందామె. ఈ ఇయర్ హృదయం, తల్లుమాల వంటి మలయాళ చిత్రాల్లో నటించి మెప్పించింది కళ్యాణి ప్రియదర్శన్.

the other language heroines who stole telugu audience heart..

#4 ఇవానా

ఈ ఇయర్ అందరి గుండెల్లో తుఫాన్ రేపిన మరో బ్యూటీ ఇవానా. తమిళ్ డబ్బింగ్ చిత్రం లవ్ టుడే తో తెలుగు వారికీ పరిచయమైంది ఇవానా. ఈ చిత్రం ఈ ఏడాది హిట్ అయినా చిన్న చిత్రాల్లో ఒకటి.

the other language heroines who stole telugu audience heart..

#5 ఐశ్వర్య లక్ష్మి

సత్యదేవ్ హీరోగా వచ్చిన ‘గాడ్సే’ చిత్రం తో ఐశ్వర్య లక్ష్మి తెలుగు వారికీ పరిచయం అయ్యింది. ఈ ఏడాది ఐశ్వర్య లక్ష్మి పొన్నియన్ సెల్వన్, అమ్ము, వంటి చిత్రాలతో తెలుగు వారికి చేరువైంది.

the other language heroines who stole telugu audience heart..
#6 సిద్ధి ఇద్నాని

తెలుగులో 2018 లో వచ్చిన జాంబ లకాది పంబ చిత్రం తో సిద్ధి ఇద్నాని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పలు తెలుగు చిత్రాల్లో ఆమె నటించింది కానీ బ్రేక్ రాలేదు. ఈ ఏడాది గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం లో వచ్చిన వెందు తనింధతు కాదు చిత్రం లో నటించి అందరి మనసులు దోచుకుంది.

the other language heroines who stole telugu audience heart..

#7 గాయత్రీ శంకర్

ఈ ఏడాది సంచలనం సృష్టించిన కమల్ హాసన్ చిత్రం విక్రమ్ చిత్రం లో నటించింది గాయత్రీ శంకర్. ఈ చిత్రం లో ఫహద్ కి జోడీగా నటించి మంచి మార్కులు కొట్టేసింది ఈ భామ.

the other language heroines who stole telugu audience heart..

#8 దుష్ర విజయన్

ఈ ఏడాది వచ్చిన తమిళ చిత్రం నచ్చతిరమ్ నగర్‌గిరదు లో రేని గా నటించి అందరి సృష్టిని ఆకర్షించింది దుష్ర.

the other language heroines who stole telugu audience heart..