Ads
మనం చిన్నప్పుడు స్కూల్ డేస్ లో ఒక ఎక్స్పరిమెంట్ చేసేవాళ్ళం.. గుర్తుందా..? కొవ్వొత్తిని వెలిగించి దానిపై గ్లాస్ బోర్లిస్తే.. కాసేపటికి కొవ్వొత్తి ఆరిపోయేది. అదే గ్లాస్ బోర్లించి కొంత గ్యాప్ వదిల్తేనో.. లేక కొంత గాలి వెళ్లే ప్లేస్ ఉంటేనో ఆ కొవ్వొత్తి వెలుగుతూనే ఉండేది. దీనికి కారణం ఏంటంటే గాలి లో ఉండే ఆక్సిజెన్. అది ఉన్నప్పుడే కొవ్వొత్తి కాంతివంతం గా మండేది.
Video Advertisement
మరి నీటిలో కూడా ఆక్సిజెన్ ఉంటుంది కదా.. మరి నీరు పొయ్యగానే మంట ఎందుకు ఆరిపోతుంది..? అని ఎప్పుడైనా ఆలోచించారా..? నీటిలో ఉండే ఆక్సిజెన్ ఎందుకు మండదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నీటి ఫార్ములా H2O . నీరు అనేది ఉదజని కాలిపోగా మిగిలిన బూడిదే. ఉదజని అంటే హైడ్రోజెన్. ఇది కాలడం వలన ఏర్పడ్డ ద్రవ పదార్థమే నీరు.
కర్బన పదార్ధం కాలడం వలన ఏర్పడిన బూడిదనే మనం నీరు అంటున్నాం. ప్రకృతి లో సహజం గా జరిగే ఈ పధ్ధతి వలెనే నీరు ఏర్పడింది. కాలగా మిగిలిన బూడిద కాబట్టే, నీరు ప్రత్యేకం గా మండదు. ఇలా ఏర్పడ్డ నీటినే మనం శుద్ధిచేసి రకరకాలు గా వాడుకుంటున్నాము. మనం రోజు స్నానం చేసే నీరు కూడా బూడిదే. అందుకే “విభూతి స్నానం” అన్న పేరు కూడా వాడుక లోకి వచ్చి ఉంటుంది అని ఒక వివరణ కూడా ఉంది.
End of Article