ఒక్క అడుగు.. చరిత్ర సృష్టించేందుకు ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది ఆర్ఆర్ఆర్ . సినీ ప్రియులు ఎంత ఉత్కంఠగా ఎదురు చూసిన ఆస్కార్ తుది నామినేషన్ల లిస్ట్ వచ్చేసింది. ఈ లిస్టులో ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాట నిలిచింది. ఇప్పుడు యావత్ భారత ప్రేక్షకుల దృష్టంతా దీనిపైనే ఉంది. నాటు నాటు పాటకు ఆస్కార్ లభిస్తే.. దేశంలోనే కొత్త చరిత్ర సృష్టిస్తుంది తెలుగు సినిమా. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఇటీవలే ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది.
Video Advertisement
చరిత్రలో ఎప్పుడూ.. ఎక్కడా.. కలవని ఇద్దరు వీరులను కలిపి ఫిక్షనల్ స్టోరీగా తెరకెక్కించి చరిత్ర సృష్టించారు రాజమౌళి. యంగ్ టైగర్ ను కొమురం భీమ్ గా మెగా పవర్ స్టార్ ను మన్యం దొర అల్లూరి సీతారామరాజుగా చూపించి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు జక్కన్న. ఈ సాంగ్ కోసం ఆర్ఆర్ఆర్ టీం ఎంతో కష్టపడింది. దానికి ఫలితమే ఇంతటి ఖ్యాతి. ఈ సాంగ్ ని ఉక్రెయిన్‌లో షూట్ చేసారు. ఈ సాంగ్ లో వెనుక కనిపించేది ఉక్రెయిన్ అధ్యక్షుడి భవనం.
కీరవాణి సంగీత సారథ్యంలో చంద్రబోస్ రచించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. నాటు నాటు పాట పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి దాదాపు 19 నెలలు పట్టింది. ఆ తర్వాత డాన్స్ కొరియోగ్రాఫర్ గా ప్రేమరక్షిత్ ని ఎన్నుకున్నారు. ఇక ప్రేమ్ రక్షిత్ ఈ పాట కోసం దాదాపు 95 స్టెప్పులు కంపోజ్ చేశాడు. తారక్, చరణ్‌లు భుజాలపై చేతులేసుకుని వేసిన హూక్ స్టెప్ కోసం ఏకంగా 30 వెర్షన్‌లు రెడీ చేశాడు.
అయితే ఈ సాంగ్ ఈ స్థాయికి రావడం పై అందరూ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లనే పొగుడుతున్నారు. ఏవైనా అవార్డు లు అందుకోవడానికి కూడా రాజమౌళి, కీరవాణి ముందు వరుసలో ఉంటున్నారు. కానీ ఈ ప్రశంసల్లో ముందుగా పాత రచయిత చంద్రబోస్ కి, కొరియోగ్రాఫేర్ ప్రేమ్ రక్షిత్ కి, సింగర్స్ కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ ని, ముఖ్యం గా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన నిర్మాత , ఈ చిత్రం ఆస్కార్ వరకు వెళ్లేంత వరకు అండగా నిలిచిన నిర్మాత డివివి దానయ్య గారిని అందరూ విస్మరిస్తున్నారు.
వారిని అన్ని మీడియా చానెళ్లు, ముఖ్యంగా సినిమా టీం కూడా వీరిని విస్మరించడం సరైన విషయం కాదు. అంత పెద్ద టీం సాన్ ఫ్రాన్సిస్కో కి వెళ్లారు కదా వీరికి మాత్రం ఆ అవకాశం ఎందుకు దొరకలేదు అని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. దీనిపై ఆర్ఆర్ఆర్ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. కాగా.. ఆస్కార్ నామినేషన్లలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్స్ కేటగిరీలో 15 పాటలను ఎంపిక చేసినట్లు ఆస్కార్ పేర్కొంది. వాటిలోనే మన నాటు నాటు పాట కూడా ఒకటి. మార్చి 13, 2023న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.