కన్నడ నటుడు, డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చిత్రం ఎంత సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. ఆ తర్వాత తెలుగుతో పాటు ఇతర భాషల్లోకి విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. కర్ణాటక ఆదివాసీ ప్రజల సంస్కృతి, సంప్రదాయాల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో రిషబ్ నటన సినిమాకే హైలైట్. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. సుమారు 30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో సుమారు 400 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు వచ్చాయి.

Video Advertisement

 

కేజీఎఫ్ తో అందర్నీ తన వైపుకు తిప్పుకున్న కన్నడ పరిశ్రమ.. ఈ చిత్రం తో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది. కన్నడ చిత్ర సీమ లో కేజీఎఫ్ తర్వాత ఎక్కువ వసూళ్లు దక్కించుకున్న చిత్రం గా కాంతార నిలిచింది. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం లో అంతగా తెలిసిన నటులు ఎవరు లేకపోయినా.. కంటెంట్ తో వచ్చి అందర్నీ ఆకట్టుకుంది.

the question about kantharaa appears in compititive exam..

హోంబలే సంస్థ నిర్మించిన ఈ చిత్రం లో రిషబ్ కి జోడీగా సప్తమి గౌడ నటించింది. ఏ అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం జాతీయ స్థాయి లో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. అయితే తమ సంస్కృతుల్ని తెరపై ఆవిష్కరించిన రిషబ్ పై సర్వత్రా ప్రశంసలు కురిసాయి. అయితే తాజాగా జరిగిన మరో సంఘటన కాంతార చిత్ర గొప్ప తనాన్ని తెలియజేస్తుంది.

the question about kantharaa appears in compititive exam..

ఓ పోటీపరీక్షల ప్రశ్న పత్రం లో కాంతార చిత్రం పై ఒక ప్రశ్న రావడంతో ఇది వైరల్ అవుతోంది. కాంతార చిత్రం కర్ణాటక లోని పలు ప్రాంతాల్లో నిర్వహించే భూతకోలా ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఎక్సమ్ పేపర్ లో.. ‘ఇటీవల విడుదలైన కాంతార చిత్రం దేని ఆధారం గా తెరకెక్కింది’ అనే ఒక ప్రశ్న ఇచ్చారు. దానికి జల్లికట్టు, భూతకోలా, యక్ష గాన, దమ్మమి అనే ఆప్షన్స్ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, హీరోయిన్ సప్తమి గౌడ్ ఆ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.