టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి చిత్రం తో తెలుగు చలనచిత్ర గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేశాడు. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రం తో అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు కొల్లుగొడుతున్నాడు. మరో వైపు దర్శకుడిగా రాజమౌళి 20 ఏళ్ళ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాడు.

Video Advertisement

రాఘవేంద్రరావు నిర్మాణ పర్యవేక్షణలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తీసిన స్టూడెంట్ నెంబర్.1తో దర్శకుడిగా మారాడు రాజమౌళి. తొలి సినిమాతోనే తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. స్టూడెంట్ నెం.1 తో ప్రారంభమైన రాజమౌళి విజయయాత్ర నేటికీ అప్రతిహతంగా కొనసాగుతునే ఉంది.

దర్శకుడు కాకముందు పలు టీవీ సీరియల్స్‌కు దర్శకుడిగా పనిచేసిన రాజమౌళి . స్టూడెంట్ నెం.1 నుండి ఆర్ఆర్ఆర్ వరకు ప్రతి సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే ఉన్నాడు. కెరీర్ తొలినాళ్లలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వద్ద పలు సీరియల్స్‌‌తో పాటు సినిమాలకు అసిస్టెంట్ పనిచేసిన రాజమౌళి…ఆయన వద్దే దర్శకత్వంలో ఎన్నో మెళకువలు నేర్చుకున్నారు. అల్పజీవి ఈగనే హీరోగా చేసి…సక్సెస్ కొట్టడం ఒక్క రాజమౌళికే చెల్లింది. గ్రాఫిక్స్ ప్రధానంశంగా తెరకెక్కిన ఈ సినిమాతో టాలీవుడ్ లోనే కాకుండా మొత్తం ఇండియా తనవైపు చూసేలా చేసాడు రాజమౌళి.

the reason behind rajamouli stamp in his movies..

అయితే రాజమౌళి తన సినిమా చివరిలో ” యాన్ ఎస్ ఎస్ రాజమౌళి ఫిల్మ్..” అని స్టాంప్ వేయడం మనకి తెల్సిందే. అయితే అలా ఎందుకు వేస్తారో గతం లో రాజమౌళి ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. ” సాధారణం గా సినిమాల్లో పేర్లు వేసేటపుడు.. డైరెక్టర్స్ పేర్లు, నిర్మాతల పేర్లు చాలా చిన్నగా ఉంటాయి. మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే వాటిని చదువుతాం. అందుకే నాకు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేసింది. ఇది నా సినిమా అని అందరికి తెలియాలి అని ఆ స్టాంప్ వెయ్యడం స్టార్ట్ చేశాను. దీని వల్ల చదువు రాని వాళ్లకు కూడా ఇది నా సినిమా అని తెలుస్తుంది. ఇక ఆ స్టాంప్ ప్రస్తుతం ఒక బ్రాండ్ లాగ మారిపోయింది ” అని రాజమౌళి వెల్లడించారు.

the reason behind rajamouli stamp in his movies..

ఇక ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు గెలుచుకుంటూ సత్తా చాటుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు గోల్డెన్ గ్లోబ్, న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్, సీటెల్ ఫిల్మ్ క్రిటిక్స్ వంటి అవార్డ్సు గెలుచుకుంది. అలాగే నాటు నాటు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఇక రాజమౌళి తన తదుపరి చిత్రం మహేష్ బాబు తో తెరకెక్కించనున్నారు.

watch video: