‘ఆర్ఆర్ఆర్’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత రామ్ చరణ్ ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటున్నారు. ఆ చిత్రం తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ‘ఆర్‌సీ15’ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. దాని తర్వాత గౌతమ్ తిన్ననూరి తో సినిమా ఉండేది.. కానీ ఆ చిత్రం ఆగిపోయినట్లు రాంచరణ్ టీం ప్రకటించింది. ఆ తర్వాత రామ్ చరణ్ బుచ్చి బాబు తో ఒక చిత్రాన్ని చేయనున్నట్లు ప్రకటన వచ్చింది.

Video Advertisement

 

 

అయితే మరోవైపు రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన స్టోరీ తో రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం చేయనున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్‌ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఇందులో హీరో పోలీస్ అని తెలుస్తోంది. “నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పడానికి నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు – అనామక గూఢచారి” అని ఆ పోస్టర్ లో ఉంది. విజయ్ దేవరకొండ మొదటిసారి ఈ చిత్రం లో పోలీస్ గా కనిపించనున్నారు.

the reason behind why ram charan rejected goutham tinnanuri project..!!

అయితే రామ్ చరణ్ ఈ సినిమా నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయం వెనకున్న కారణంపై ఇంట్రెస్టింగ్ కథనం వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్‌కు ముందే ‘జెర్సీ’ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఓ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చరణ్. అయితే అతను పోలీస్ క్యారెక్టర్‌తో కూడిన కథ చెప్పాడు. ఇప్పుడు అదే చరణ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోదనికి కారణం. ఎందుకంటే చెర్రీ ఆర్ఆర్ఆర్ చిత్రంలో కూడా బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసే పోలీస్ అధికారి పాత్ర పోషించాడు. కాబట్టి మరోసారి పోలీస్ క్యారెక్టర్‌లో నటిస్తే ఎలా ఉంటుందోనన్న సందేహంతో తప్పుకున్నారని సమాచారం. పైగా ఈ కథలో కూడా తనది వింటేజ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కావడంతో ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యారు.

the reason behind why ram charan rejected goutham tinnanuri project..!!

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ మరియు శ్రీకరా స్టూడియోస్ బ్యానర్‌లతో కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది. అలాగే ఈ చిత్ర విషయానికి వస్తే ఇదొక స్పై ఫిల్మ్ అని పోస్టర్ ని బట్టి అర్థమవుతోంది. ఈ పోస్టర్ చూస్తుంటే.. వింటేజ్ పోలీస్ ఆఫీసర్ మాదిరే కనిపిస్తుంది. అలాగే సముద్రతీరంలో యుద్ధ సన్నివేశాన్ని తలపించేలా మంటల్లో దగ్ధమవుతున్న పడవలతో పోస్టర్ ను ఆసక్తి రేకెత్తించేలా రూపొందించారు. ఇంత మంచి కథకు విజయ్ పెర్ఫామెన్స్ కూడా యాడ్ అయితే.. ఖచ్చితంగా హిట్ అయ్యే చాన్స్ ఉంది. దీంతో ఈ చిత్రం పైనే రౌడీ హీరో ఫాన్స్ ఆశలు పెట్టుకున్నారు.