మలయాళ నటి సాయి పల్లవి డాన్స్ షో లతో గుర్తింపు పొంది..హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకున్నారు. ఆమె తన సహజ నటనతో ఎందరో అభిమానులను గెలుచుకున్నారు. స్వతహాగా డాన్సర్ అయిన సాయి పల్లవి తెలుగులో ‘ఢీ’ షో తో పాటు కన్నడ, తమిళ భాషల్లో ప్రసారమైన డాన్స్ షోస్ లో పాల్గొని ప్రతిభ నిరూపించుకున్నారు.

Video Advertisement

కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న పాత్రలు చేసి సాయిపల్లవి..మలయాళ చిత్రం ప్రేమమ్ తో హీరోయిన్ గా మారారు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో సాయి పల్లవి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. కేవలం ఒక్క సినిమా చేసి డాక్టర్ గా స్థిరపడదాం అనుకుంది సాయి పల్లవి. కానీ వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ గా మారింది. ప్రేమమ్ తర్వాత వచ్చిన ఫిదా చిత్రం తో తెలుగు వారికీ దగ్గరయింది సాయి పల్లవి.

the reason for sai pallavi not saigned any movies for 1 year...

 

నటించినవి కొన్ని సినిమాలే అయినా..అందరికీ భిన్నంగా, తన స్వభావానికి దగ్గరగా ఉండే సినిమాలు తియ్యడం సాయి పల్లవి నైజం. నటనలోనూ, నాట్యం లోనూ , పెద్ద హీరోలతో పోలిస్తే దేనికి తీసిపోదు. తను ఎంచుకునే కథలతోనే అందరి మనసులు దొచేస్తోంది. అయితే సాయి పల్లవి గత కొంతకాలంగా ఏ సినిమాకి సైన్ చెయ్యలేదు.

 

the reason for sai pallavi not saigned any movies for 1 year...

లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ, విరాట పర్వం చిత్రాల తర్వాత గార్గి చిత్రం మాత్రమే చేసింది సాయి పల్లవి. కానీ ఆ తర్వాత మరో చిత్రం ప్రకటించలేదు. దీంతో ఆమె నటనకు దూరం కానుందన్న పుకార్లు వినిపించాయి. తాజాగా ఈ విషయం పై స్పందించింది సాయి పల్లవి.  ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సాయి పల్లవి సినిమాలకు గ్యాప్ రాలేదని.. తానే కొంచెం గ్యాప్ తీసుకుంటే బావుంటుంది అనుకున్నానని.. అందుకే ఏ చిత్రాలకు సైన్ చెయ్యలేదని వెల్లడించింది.

the reason for sai pallavi not saigned any movies for 1 year...

అయితే సినిమాల్లో నటించిన తర్వాత ఎప్పటికైనా డాక్టర్ వృత్తిలో స్థిరపడతానని ఆమె వెల్లడించింది. ఇక ఏడాది గ్యాప్ తరువాత సాయి పల్లవి ప్రస్తుతం తమిళం లో కమల్ హాసన్ నిర్మిస్తున్న చిత్రం లో శివ కార్తికేయన్ కి జంటగా నటిస్తోంది. అలాగే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించనుందని వార్తలు వస్తున్నాయి.