ఇండస్ట్రీలో ఓ హీరోతో అనుకున్న కథ మరో హీరోకి వరకు వెళ్లి చివరకి మరో హీరోతో పట్టాలేక్కుతుంది. ఇది చాలా సాధారణ విషయం కూడా.. అయితే ప్రస్తుతం బాలయ్య తో ‘వీరసింహ రెడ్డి’ చిత్రం తీసి ఫుల్ జోష్ లో ఉన్న గోపీచంద్ మలినేని కూడా ఇటువంటి సంఘటనని తాజాగా వెల్లడించారు. అదే ‘డాన్ శీను’ చిత్రం. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా మొత్తం ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. అవే డాన్ శీను, బలుపు, క్రాక్ చిత్రాలు. సక్సెస్ఫుల్ కాంబినేషన్‌గా ఇండస్ట్రీలో వీరికి మంచి పేరుంది. ముందుగా వీరి కాంబినేషన్ నుంచి వచ్చిన చిత్రం డాన్ శీను.. ఇదే గోపీచంద్ మలినేనికి దర్శకుడిగా మొదటి సినిమా. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Video Advertisement

 

వరుస‌ ప్లాపుల్లో ఉన్న రవితేజ ఈ సినిమాతో మళ్ళీ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అయితే ఈ చిత్రాన్ని గోపీచంద్ మలినేని ముందుగా ప్రభాస్ తో తీద్దాం అనుకున్నారట. దిల్ రాజు ఈ మూవీని నిర్మించేందుకు ముందుకు వ‌చ్చాడ‌ట‌. ఇందులో భాగంగానే ప్రభాస్ కు కథ వినిపించగా ఆయనకు బాగా నచ్చే సినిమా చేద్దామని ఓకే చెప్పాడట. కానీ ఆ వెంటనే `ఏక్‌ నిరంజన్` మూవీ మొదలైంది. ప్రభాస్ కాల్షీట్లు దొరకడానికి చాలా కాలం ఎదురు చూడాల్సిన పరిస్థితి.

the super hit movie.. which missed by prabhas..

దాంతో గోపీచంద్ మలినేని టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కు స్టోరీ చెప్పాడట. అయితే గోపీచంద్ కు సైతం కథ నచ్చినప్పటికీ గోలీమార్, వాంటెడ్ వంటి సినిమాలకు కమిట్ అవడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడట. ఇక తర్వాత గోపీచంద్ మలినేని ఆ కథతో ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వారి వద్దకు వెళ్ళాడట.. వాళ్ల దగ్గర రవితేజ బల్క్‌ కాల్ షీట్లు ఉండటంతో.. ఆయనకు కథ చెప్పడం, నచ్చడం, వెంటనే సినిమాను ప‌ట్టాలెక్కించ‌డం చకచకా జరిగిపోయాయి. ఇక 77 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసి డాన్ శీను సినిమాను విడుదల చేశారట.

the super hit movie.. which missed by prabhas..

ఇలా తన మొదటి చిత్రం తోనే సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని.. ప్రస్తుతం క్రాక్, వీర సింహా రెడ్డి తో వరుస హిట్స్ ను ఖాతా లో వేసుకొని ఫుల్ జోష్ లో ఉన్నారు. మరోవైపు రవితేజ కూడా ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టారు. తర్వాత టైగర్ నాగేశ్వర రావు చిత్రం చేస్తున్నాడు రవి తేజ. అయితే రెండు హిట్స్ తో జోరు మీదున్న గోపీచంద్ మలినేని తన తదుపరి ప్రాజెక్ట్ ఇప్పటివరకు ప్రకటించలేదు.