మీ “పిడికిలి” ని బట్టి మీరు ఎలాంటి వారో అనేది చెప్పేయొచ్చు..! ఎలా అంటే..?

మీరు పిడికిలి బిగించినపుడు బొటన వేలును లోపలికి పెడతారా..? మీ చూపుడు వేలుకు పైన మీ బొటనవేలును పెడతారా..?? అసలు పిడికిలి బిగించేటపుడు అన్ని వేళ్లను లాక్ చేయడానికి మీ బొటన వేలునే ఎందుకు ఉపయోగిస్తున్నారు?..

మీరు పిడికిలి బిగించే విధానం మీ వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుందని మీకు తెలుసా? ఇదొక్కటే కాదు మీ పెదవుల ఆకారం, చేతులు, నిద్రించే భంగిమ, ముక్కు ఆకారం, కూర్చోవడం వంటివి మీ వ్యక్తిత్వ లక్షణాలను తెలియజేస్తాయి. వ్యక్తిత్వ పరీక్షల ద్వారా వీటిని తెలుసుకోవచ్చు.

The way you make a fist says a lot about your personality
పర్సనాలిటీ టెస్ట్ (వ్యక్తిత్వ పరీక్ష)లు మీ గురించి, మీ ఇష్టాలు, అయిష్టాలు, మీ ఆలోచనలు, మీ ఐక్యూ స్థాయిల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి.
ఇప్పుడు మీ పిడికిలి మీ గురించి ఏం చెప్తుందో చూద్దాం..
# ఏ

The way you make a fist says a lot about your personality
మీరు మీ పిడికిలిని బిగించినపుడు చూపుడు వేలి పైన బొటన వేలు ఉంటే.. మీలో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయని అర్థం. మీరు మీ లక్ష్యాల కోసం అవిశ్రాంతగా పని చేస్తారు. ప్రతిభావంతులు. ఏకాగ్రత కలిగినవారు. మీరు పని చేసే వద్ద కానీ, వ్యాపారంలో కానీ మీరు చేసే పనులు మిమ్మల్నిప్రత్యేకంగా నిలబెడతాయి.

కొత్త విషయాలు, కొత్త ప్రాంతాల గురించి తెలుసుకోవడం మీకు ఆసక్తి. ఇతర వ్యక్తులకు మార్గ నిర్దేశం చేయడం లో ఎప్పడు ముందుంటారు. అన్యాయాన్ని సహించరు. ఇతరులతో మంచిగా వ్యవహరిస్తారు. మీరు మంచి శ్రోత. బయటి పరిస్థితులు మీ మనశ్శాంతిని పాడుచేయకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు.

ముఖ్య లక్షణాలు: ఉత్సాహం, కరుణ, నాయకుడు, స్థిరత్వం, దృఢత్వం, దృష్టి, సాధకుడు, అన్వేషకుడు, తెలివి , ఇతరులకు సహాయం చేయడం ప్రేమ, ఉదారత, స్నేహశీలి, మంచి శ్రోత, స్వీయ నియంత్రణ

#బి

The way you make a fist says a lot about your personality
మీరు మీ చేతివేళ్లన్నింటికీ అడ్డంగా బొటనవేలుతో బయట మీ పిడికిలి బిగిస్తే.. మీరు చాలా సృజనాత్మక కలిగిన వ్యక్తి అని అర్థం. మీకు ఆత్మగౌరవం ఎక్కువ. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, మనస్తత్వం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా మీపై విశ్వాసం, నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఏ విషయాన్ని అయినా సూటిగా చెప్తారు. మీరు నిజాయితీగా ఉండటం వల్ల జీవితం ఆనందం గా ఉంటుంది.

మీ జీవితం రొటీన్ గా ఉండటాన్ని మీరు ఇష్టపడరు. ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటారు. ఏ విషయాన్నీ అయినా, వ్యక్తులను అయినా పట్టించుకోవద్దు అనుకున్న తర్వాత ఇంక పట్టించుకోరు.

ముఖ్య లక్షణాలు: సృజనాత్మక, ఆత్మగౌరవం, ఆకర్షణీయం, ఆలోచనా విధానం, ప్రభావవంతమైన కమ్యూనికేషన్ స్కిల్స్, అధిక మేధస్సు, సూటిగా మాట్లాడే తత్త్వం , స్వయం సమృద్ధి.

#సి

The way you make a fist says a lot about your personality
మీరు మీ బొటనవేలిని లోపల పెట్టి పిడికిలి బిగిస్తే.. మీరు అంతర్ముఖుడు (ఇంట్రావర్ట్). మీరు గోప్యతను ఇష్టపడతారు. మీ ఆలోచనలు, భావాలు మీలోనే ఉంచుకుంటారు. మీరు బిజినెస్ చేయడం మంచిది. చాలా సృజనాత్మకంగా ఉంటారు. ‘అవుట్ ఆఫ్ ది బాక్స్’ ఆలోచనలు చేస్తారు.నిజమైన బంధాలకే విలువ ఇస్తారు. చాలా దయ గలవారు. మీరు చాలా తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా వింటారు.

తమ గురించి ప్రగల్భాలు పలికే వ్యక్తులను మీరు ఇష్టపడరు. పుకార్లు, నటనలను ఇష్టపడరు. మీరు సిగ్గు పడుతూ రిజర్వ్‌డ్‌గా ఉంటారు. మీరు మీ పని, రిలేషన్స్, ఫ్రెండ్స్, కుటుంబం అంటే చాల ఇష్టం గా బాధ్యతగా ఉంటారు. కష్ట కాలంలో కూడా తొణక్కుండా ఉంటారు.

ముఖ్య లక్షణాలు: అంతర్ముఖుడు, గోప్యత ,సానుభూతి, పుకార్లు ఇష్టపడని తత్త్వం, పిరికి, రిజర్వ్‌డ్, ఎమోషనల్, లో ప్రొఫైల్, సామరస్యం.