ఈ ఏడాది లో రెండో నెల ఫిబ్రవరి కూడా ముగింపుకొచ్చేసింది.. సంక్రాంతి సీజన్ పెద్ద హీరోల సినిమాలతోనే సరిపోయింది.. ఫిబ్రవరిలో ఎక్కువగా చిన్న చిత్రాలు సందడి చేశాయి కానీ హిట్ పర్సంటేంజ్ చాలా అంటే చాలా తక్కువ. ఇక వచ్చేది పరీక్షల సీజన్ కావడం తో మరో మూడు, నాలుగు వారాల పాటు చిన్న సినిమాలే విడుదల కానున్నాయి. ఇక కంటెంట్ ఉంటే చిన్న చిత్రాలను కూడా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఇక ఈ వారం థియేటర్లలో విడుదల కానున్న చిత్రాలేవో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

#1 బలగం

వేణు ఎల్దండి దర్శకత్వం లో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో.. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘బలగం’. ప్రోమోలతోనే పాజిటివ్ వైబ్రేషన్స్ తెచ్చుకున్న ‘బలగం’ మూవీని మార్చి 3న నిర్మాత దిల్ రాజు భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

#2 ఆర్గానిక్ మామ – హైబ్రీడ్ అల్లుడు

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణా రెడ్డి కొంత గ్యాప్ తర్వాత ‘ఆర్గానిక్ మామ – హైబ్రీడ్ అల్లుడు’ తో మెగాఫోన్ పట్టారు.. రాజేంద్ర ప్రసాద్, మీనా, సోహైల్, మృణాళిని రవి కీలక పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం మార్చి 3 న రిలీజ్ కానుంది.

#3 ఇన్ కార్

హర్షవర్ధన్ దర్శకత్వం లో రితిక సింగ్ ప్రధాన పాత్రలో రూపొందిన థ్రిల్లర్ చిత్రం ఇన్ కార్. హిందీ లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 3 న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.

#4 రిచి గాడి పెళ్లి

కె.ఎస్. హేమరాజ్ దర్శకత్వం లో సత్య, చందన రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రిచి గాడి పెళ్లి. ఈ చిత్రం మార్చి 3 న విడుదల కానుంది.

#5 సాచి

బిందు అనే యువతి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సాచి’.. సంజన రెడ్డి, గీతిక రధన్ కథానాయికలు. వివేక్ పోతగోని దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 3 న ప్రేక్షకుల ముందుకి రానుంది.