శకునికి కూడా ఆలయం ఉందని మీకు తెలుసా.? ఇంతకీ ఎక్కడంటే.?

శకునికి కూడా ఆలయం ఉందని మీకు తెలుసా.? ఇంతకీ ఎక్కడంటే.?

by Megha Varna

Ads

సాధారణంగా శకుని అని అంటే మనకి దుష్టుడు గానే అనిపిస్తుంది. కానీ నిజానికి మహాభారతాన్ని మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే శకుని మీద దుష్టుడు అనే భావన తొలగి పోతుంది. కౌరవ పక్షాన నిలబడి జూదం రూపంలోని దుర్మార్గుల వినాశానికి శకుని కారకుడయ్యాడు. నిజానికి శకుని చేత అలా చేయించింది శ్రీకృష్ణుడు.

Video Advertisement

ధర్మాన్ని కాపాడడానికి కర్మ సాధనంగా శకుడుని ఉపయోగించారు తప్ప అతనేం చెడ్డ వారు కారు. అయితే ఇంత గొప్ప శకునికి దేవాలయాలు లేవు అనుకుంటే పొరపాటు.

ఒక ప్రదేశంలో మాత్రం శకునికి ఆలయం కట్టించడం జరిగింది. అవునా శకునికి కూడా ఆలయం ఉందా అని ఆశ్చర్య పోవద్దు. అది కూడా మన భారతదేశంలోనే ఉంది. మరి ఇక ఆ ఆలయాలకు సంబంధించి పూర్తి వివరాలను చూస్తే… కేరళ రాష్ట్రంలో శకునికి ఆలయం కట్టించారు. అక్కడ శకునికి అన్ని దేవుళ్ళకి పూజ చేస్తున్నట్టే పూజలు చేస్తారు.

పాండవులు అజ్ఞాత వాసం చేసేటప్పుడు కౌరవులు పాండవుల కోసం వెతికిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పవిత్రేశ్వరం అని పిలుస్తున్న ఊరిలో ఆయుధాలను రహస్యంగా ఉంచారు. ఈ పవిత్ర ఈశ్వరం సరిహద్దుల్లో మాయంగోడు మాలాన్ సరవు మలనాడా ఆలయం ఉంది. ఇక్కడ శకుని ప్రధానదైవం. భీష్ముడు పై ప్రతీకారం కోసం తాను చేసిన పాపాలను తలుచుకుని శకుని ఈశ్వరుడికి తపస్సు చేశాడు.

పరమ శివుడు అనుగ్రహం పొంది మోక్షం పొందాడు శకుని. ఈ ఆలయానికి భక్తులు ఏ వేళలో అయినా వెళ్లొచ్చు. అయితే నిజానికి శకుని మంచివాడు కానీ పరిస్థితుల వల్ల మాత్రమే కొన్ని తప్పులు చేశాడు. కొన్ని తెగల ప్రజలు అయితే శకునికి పూజలు కూడా చేస్తూ ఉంటారు. మామూలుగా ఇతరుల దేవుళ్ళకి ఎలా అయితే పూజలు చేస్తామో అలానే శకునికి కూడా పూజలు చేయడం జరుగుతుంది. ఈ పవిత్రేశ్వరం కేరళలోని కొల్లం జిల్లా కొట్టారక్కర తాలూకాలో ఉంది. తిరువనంతపురానికి ఇది కేవలం 64 కిలోమీటర్లు మాత్రమే.


End of Article

You may also like