సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయంటే ఆ మూవీ హిట్టైనా, ఫ్లాపైనా కనీసం ఒకసారి అయినా థియేటర్లకి వెళ్ళి చూసేలా ఉంటాయని అనుకుంటారు. కానీ కొన్ని చిత్రాలు మాత్రం ఆడియెన్స్ కి సీరియల్ చూసిన ఫీల్ కలగడం ద్వారా ఫ్లాప్ గా నిలిచాయి.

Video Advertisement

తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి  సీరియల్ చూసిన భావన కలిగించిన సినిమాల జాబితా కొంచెం ఎక్కువగానే ఉంది. అందులో టాలీవుడ్ అగ్రహీరోల చిత్రాలు కూడా ఉండడం గమనార్హం. మరి అలాంటి టాక్ తెచ్చుకున్న 12 సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
telugu-movies-get-serial-talk1.శాకుంతలం:
సమంత, దేవ్ మోహన్ జంటగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘శాకుంతలం’.ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు.ఈ మూవీ రీసెంట్ గా విడుదల కాగా, సీరియల్ లా ఉందని కామెంట్స్ వస్తున్నాయి.
samantha about shakunthalam movie..!!2.వారసుడు:
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో నటించిన సినిమా వారసుడు. రొటీన్ ఫ్యామిలీ స్టోరీ కావడంతో ఈ మూవీకి కూడా సీరియల్ అనే టాక్ వచ్చింది. ఈ మూవీని నెటిజెన్లు సోషల్ మీడియాలో మీమ్స్ తో ట్రోల్ చేశారు.
3. ఆచార్య:
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఆచార్య’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, పూజ హెగ్డే నటించారు. తెలుగు ఇండస్ట్రీలో భారీ డిజాస్టర్స్ లో ఒకటిగా ఈ చిత్రం నిలిచింది. అప్పటిదాకా ప్లాప్ ఎరుగని డైరెక్టర్ కొరటాల శివకి ఈ మూవీ డిజాస్టర్ ను పరిచయం చేసిందని చెప్పవచ్చు.
4.బ్రహ్మోత్సవం:
సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటించిన చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ సినిమాలో సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. రిలీజ్ అయిన రోజు నుండే సీరియల్ అనే టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ మూవీ మహేష్ కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలిచింది.5.శ్రీకారం:
శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన సినిమా శ్రీకారం. 2021లో విడుదలైన ఈ సినిమా కూడా సీరియల్ లా ఉందని టాక్ వచ్చింది. ఈ మూవీకి బి.కిషోర్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ప్లాప్ గా నిలిచింది.
6.వరుడు:
అల్లు అర్జున్ – గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం వరుడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా సీరియల్ అనే టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం ప్లాప్ అయ్యింది7.ఇంటిలిజెంట్:
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. మొదటి షోతోనే మెగా అభిమానులు, ఆడియెన్స్ పెదవి విరిచారు. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించారు.
8.గోరింటాకు:
2008లో వి. ఆర్. ప్రతాప్ దర్శకత్వంలో రిలీజ్ అయిన కుటుంబకథా చిత్రం గోరింటాకు. అన్న చెల్లెల సెంటిమెంట్ తో రూపొందిన ఈ మూవీలో రాజశేఖర్, ఆర్తీ అగర్వాల్, మీరా జాస్మిన్, ఆకాష్ నటించారు.
9.సన్‌ ఆఫ్‌ ఇండియా:
డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన సినిమా ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం పై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరిగింది. ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మించాడు.
10.టక్‌ జగదీష్:
శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా,రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో జగపతిబాబు కీలకమైన పాత్రలో నటించారు. టక్‌ జగదీష్ సినిమా 2021లో విడుదల అయ్యింది. ఈ మూవీ కూడా సీరియల్ టాక్ తో ప్లాప్ అయ్యింది.11.థాంక్యూ:
‘మనం’ మూవీ తరువాత విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో నాగ చైతన్య హీరోగా నటించిన సినిమా ‘థాంక్యూ’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, మాళవిక నాయర్ లు హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం మొదటి షో తోనే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.
12.శ్రీనివాస కళ్యాణం:
సతీష్ వేగశ్న దర్శకత్వంలో నితిన్, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. 2018లో విడుదలైన ఈ మూవీ సీరియల్ టాక్ తో ప్లాప్ గా నిలిచింది. ఈ మూవీని నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై నిర్మించారు.

Also Read: “సాహూ” నుండి “శాకుంతలం” వరకు… పాన్-ఇండియన్ రేంజ్ లో రిలీజ్ అయ్యి “ఫ్లాప్” టాక్ తెచ్చుకున్న 12 సినిమాలు..!