Ads
హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగల్లో శ్రీరామ నవమి కూడా ఒకటి. శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు, కర్కాటక లగ్నంలో జన్మించాడు. సీతారాముల కళ్యాణం కూడా చైత్ర శుద్ధ నవమి నాడు జరిగింది.
Video Advertisement
అంతే కాకుండా అయోధ్యలో సీతారాములకు పట్టాభిషేకం జరిగింది కూడా చైత్ర శుద్ధ నవమి రోజునే. చైత్ర మాసంలో వచ్చే తొమ్మిదో రోజున శ్రీరామ నవమి పండుగను ఘనంగా జరుపుతారు. ఈ ఏడాది మార్చి 30 న శ్రీరామ నవమి పండుగను జరుపుకొనున్నారు. అయితే ఈ పవిత్రమైన రోజున కొన్ని పనులను తప్పనిసరిగా చేయాలి. అయితే కొన్నింటిని చేయకూడదు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
చేయవలసిన పనులు:
- శ్రీరామ నవమి రోజున ఉపవాసం చేయడం వల్ల శ్రేయస్సు, సంతోషం కలిగి, చేసిన పాపాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు.
- శ్రీరామ నవమి రోజున నిద్ర నుండి మేల్కొన్న వెంటనే భగవంతుడికి అర్ఘ్యంను సమర్పించాలి.
- అయోధ్యలో ఉన్న సరయు నదిలో స్నానం ఆచరించడం వల్ల గత జన్మల పాపాలు నశిస్తాయి.
- శ్రీరామనవమి పండుగ రోజున రాముని భజనలు, కీర్తనలు, స్తోత్రాలను పఠించాలి.
- శ్రీరామ నవమి రోజున పేదలకు దానం చేయడం చాలా మంచిది.
- కష్టాల్లో ఉన్నవారితో దయగా, ఉదారంగా ఉండాలి.
ఈ పవితమైన రోజున ఎవరిని కూడా మోసం చేయడం కానీ, హింసించడం కానీ చేయకూడదు అని పండితులు సూచిస్తున్నారు.
చేయకూడని పనులు:
- శ్రీరామ నవమి రోజున మాంసాహారం మరియు మద్యంను తీసుకోకూడదు.
- ఆ రోజున చేసే వంటలలో ఉల్లిపాయలుకానీ, వెల్లుల్లిని కానీ ఉపయోగించకూడదు.
- పవిత్రమైన రామ నవమి రోజున హెయిర్ కట్, షేవింగ్ చేయకూడదు.
- శ్రీరామ నవమి రోజున ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం కానీ, విమర్శించడం కానీ చేయకూడదు.
- ఇతరులకు ద్రోహం చేయవద్దు.
Also Read: UGADI RASHI PHALALU 2023 – 2024: శోభాకృతు నామ సంవత్సర “ఉగాది” రాశి ఫలాలు 2023…ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం.!
End of Article