జీవితం లో ఈ 5 విషయాలు ఎదురైతే.. మనిషి లోలోపలే కుంగిపోతాడు… అవి ఏమిటంటే..?

జీవితం లో ఈ 5 విషయాలు ఎదురైతే.. మనిషి లోలోపలే కుంగిపోతాడు… అవి ఏమిటంటే..?

by Megha Varna

Ads

చాణక్యుడు ఎంతటి మహా జ్ఞానో అందరికీ తెలుసు. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆర్థిక సూత్రాలు ఇప్పటికి కూడా ఎంతోమంది ఆచరిస్తున్నారు. చాణక్యుడు రచించిన అర్థశాస్త్రం లో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. చాణక్యుడు చెప్పిన నీతి వాక్యాలు నేటికీ అనుసరించాల్సినవే.

Video Advertisement

వాటిని నిజంగా తర్వాత తరానికి కూడా అందించి మంచి భవిష్యత్తును రూపొందించుకునేలా తోడ్పడాలి. ఆచార్య చాణక్యడు చాణక్య నీతి లో ఆనందాన్ని, శాంతిని హరింపచేసే కొన్ని ముఖ్యమైన విషయాలను తెలిపారు. ఇవి కనుక మనిషి జీవితంలో ఎదురైతే లోలోపలే కృంగిపోతారని హెచ్చరించారు చాణక్యుడు. మరి ఇక వాటి గురించి చూద్దాం.

Also Read:   ప్రామిస‌రీ నోట్ రాసేటప్పుడు ఈ 10 విషయాలు తప్పక గుర్తుపెట్టుకోవాలి…లేదంటే అప్పు ఎగ్గొట్టినా ఏం చేయ‌లేరు.!

#1. కుమార్తె కళ్లముందే వితంతువు అవ్వడం:

తండ్రి కళ్ళ ముందు కుమార్తె వితంతువు అయితే ఆ తండ్రి అస్సలు తట్టుకోలేడు. కూతురు సంతోషంగా లేకపోతే తండ్రి అస్సలు సంతోషంగా ఉండలేడు అని తెలిపారు.

#2. నీచుల సహవాసము:

చెడు చేసే వాళ్ళ మాటలు ఎంతో కటువుగా ఉంటాయి. అలానే ఎప్పుడూ గొడవలు కోపంతో రగిలి పోతారు. అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే దుర్మార్గపు లక్షణాలు అలవాటు అవుతాయి. అందుకని మీ కుటుంబానికి కానీ మీకు కానీ హాని చేసే వ్యక్తులకు సహకారం అందించవద్దని చాణక్య అంటున్నారు. అలా కాదని మంచిగా ఉండాలని మీరు అనుసరించారు అంటే ఎప్పటికైనా నరకప్రాయం అవుతుందని అన్నారు.

#3. మూర్ఖత్వంతో ఉండడం:

మూర్ఖత్వంతో చాలామంది ప్రవర్తించి కన్నతల్లిని కూడా బాధ పెడుతూ ఉంటారు. మూర్ఖుడు రెండు కాళ్ల జంతువు అని చాణక్యుడు అన్నారు. అయితే ఇలా అందరినీ బాధ పెట్టి చిల్లరిగా తిరిగే వాళ్ళ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు.

#4. గయ్యాళి భార్య:

గయ్యాళి భార్యతో భర్త నిజంగా ఎంతో కుంగిపోవాలా అని చెప్పారు. అలాంటి భార్యతో కాపురం చెసే భర్త లోలోపలే కుంగిపోతాడు అని చాణక్య నీతి చెబుతోంది.

#5. ఇలా జరిగితే ఉండలేము:

ఒక వ్యక్తి తాను అపఖ్యాతి పాలైన ప్రాంతంలో నివాసం కొనసాగించడం ఎంతో ప్రమాదకరమైనది. ఒకవేళ పరోపకార భావనతో ఉన్నా సరే తనకి మాత్రమే కాకుండా కుటుంబానికి కూడా ఇది ప్రమాదాన్ని తీసుకొస్తుంది.

Also Read:  లాయర్” కి “అడ్వకేట్” కి మధ్య ఉన్న తేడా మీకు తెలుసా.? ఇద్దరు ఒకరే అనుకుంటే పొరపాటే.!


End of Article

You may also like