ఈ ఆహారపదార్ధాలకి గడువు తేదీ ఉండదు మీకు తెలుసా..?

ఈ ఆహారపదార్ధాలకి గడువు తేదీ ఉండదు మీకు తెలుసా..?

by Megha Varna

Ads

మామూలుగా మనం ఏదైనా ఆహార పదార్థాలను కొనుగోలు చేయాలంటే దాని యొక్క ఎక్సపైర్ డేట్ చూసి కొనుగోలు చేస్తూ ఉంటాము. అయితే కొన్ని ఆహార పదార్థాలు కి మాత్రం ఎక్స్పైర్ డేట్ ఏ ఉండదు. ఈ ఆహార పదార్థాలు ఎంత కాలమైనా సరే నిల్వ ఉంటాయి.

Video Advertisement

దాని మీద ఎక్స్పైర్ డేట్ రాసినప్పటికీ కూడా నిజానికి అవి పాడైపోవు. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటి..? వీటిని ఎక్స్పైర్ అయినా వాడచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.

#1. ఉప్పు:

ఉప్పుని మనం ఇంచుమించు అన్ని వంటకాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాము. అయితే ఉప్పు ఎప్పుడూ కూడా రుచి ని కోల్పోదు. ఈ ఉప్పు కి అసలు ఎక్స్పైర్ డేట్ కూడా ఉండదు. ఆ గడువు తేదీ ముగిపోయినా సరే అది పాడవ్వదు.

#2. కాఫీ:

కాఫీ కి కూడా గడువు తేదీ ఉండదు. గడువు తేదీ తర్వాత కూడా కాఫీను తీసుకో వచ్చు. కాఫీ సాంద్రీకృత మిశ్రమాన్ని ఎండబెట్టడం ద్వారా ఇన్స్టెంట్ కాఫీని తయారు చేస్తారు. అయితే ఇలా తయారు చేసే ప్రాసెస్ లో ఇది చెడి పోకుండా చేస్తారు. దీంతో అది ఎక్స్పైర్ అయినప్పటికీ కూడా పాడై పోదు. అందుకనే ఒకవేళ కాఫీ ఎక్స్పైర్ డేట్ దాటినా సరే వాడుకొచ్చు. ఏ ఇబ్బంది ఉండదు.

#3. తేనె:

తేనెను కూడా గడువు తేదీ పూర్తయిన తర్వాత వాడుకోవచ్చు. తేనె లో నీటి శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఆహారపదార్ధాల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటే అది త్వరగా పాడైపోతుంది. అయితే తేనె లో నీరు చాలా తక్కువగా ఉంటుంది కనుక అది పాడైపోదు.

#4. సోయా సాస్:

సోయా సాస్ ని కూడా గడువు తేదీ దాటిపోయిన తర్వాత వాడుకోవచ్చు. ఓపెన్ చేయని సోయా సాస్ బాటిల్ దశాబ్దాల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇది కూడా త్వరగా పాడవ్వదు. అలానే గడువు ముగిసినా సరే వాడుకోచ్చు. ఏ సమస్య ఉండదు.


End of Article

You may also like