చాణక్య నీతి: ఈ 4 లక్షణాలు ఉంటే విడిపెట్టేయండి… లేదంటే ఓటమే మీకు మిగిలేది…!

చాణక్య నీతి: ఈ 4 లక్షణాలు ఉంటే విడిపెట్టేయండి… లేదంటే ఓటమే మీకు మిగిలేది…!

by Megha Varna

చాణక్యుడు మన జీవితంలో జరిగే ఎన్నో విషయాల గురించి ప్రస్తావించారు. ఏ సందర్భంలో ఎలా ఉండాలి..?, గెలుపు ఎలా వస్తుంది..?, ఎటువంటి వ్యక్తులతో స్నేహం చేయాలి..? ఇలా చాలా విషయాలని చాణక్యుడు చెప్పడం జరిగింది. ఆయన అనుభవంతో చెప్పిన విషయాలను ఈ తరం వాళ్లు అనుసరిస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు.

Video Advertisement

కేవలం పెద్ద వాళ్ళకి మాత్రమే కాకుండా పిల్లలకి కూడా ఆయన ఎన్నో విషయాలను తన నీతి శాస్త్రం ద్వారా తెలిపారు. వీటిని కనుక అనుసరిస్తే ఓటమి రానేరాదు. అయితే జీవితంలో ఓటమి ఎదుర్కోకుండా ఉండాలంటే వ్యక్తిలో ఈ నాలుగు అలవాట్లు ఉండకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పారు. అయితే మరి ఆ అలవాట్లు ఏంటో చూద్దాం.

#1. సమయం వృధా చెయ్యద్దు:

సమయం ఒక సారి గడిచిపోతే మళ్లీ అది తిరిగి రాదు. ఈ విషయం అందరికీ తెలుసు కానీ అనుసరించరు. సమయపాలన లేదు అంటే కచ్చితంగా విఫలం అవుతారు. ఓటమిని ఎదుర్కోవడం తధ్యం. కనుక సమయానికి విలువ ఇచ్చి సరిగ్గా సమయాన్ని ప్లాన్ చేసుకుంటే ఎవరైనా సరే సులభంగా గెలవచ్చు.

#2. నెగిటివ్ ఆలోచనలు ఉండకూడదు:

నెగిటివ్ ఆలోచన ఉంది అంటే అస్సలు ముందుకు వెళ్ళలేరు. ఎప్పుడూ కూడా పాజిటివ్ గా ఆలోచించి ముందుకు వెళ్లి పోవాలి. పాజిటివ్ గా ఆలోచిస్తే ఎంతటి సమస్యను అయినా దాటేయచ్చు.

#3. అహంకారం వద్దు:

అహంకారం ఉంది అంటే జీవితంలో ముందుకు వెళ్ళడం కష్టం. ఎప్పుడూ కూడా జీవితంలో ఒదిగి ఉండాలి. అహంకారంతో నేనే గొప్ప అనుకుంటూ వెళితే విలువ కూడా ఉండదు.

#4. కోపం పనికిరాదు:

కోపం ఉంటే కూడా ఓడిపోతూ ఉంటారు. కోపం వల్ల జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. పైగా కోపం ఉంటే ఎవరూ ఇష్టపడరు కూడా. కాబట్టి ఈ నాలుగింటిని విడిచిపెడితే విజయం అందుకోవచ్చు.


You may also like